సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. సెలబ్రెటీలకు ఫ్రీడమ్ అనేది లేకుండా పోయింది. వాళ్లు ఏది మాట్లాడినా వెంటనే వైరల్ అయిపోతోంది. వాళ్ల మాటలను పట్టుకొని నెటిజన్లు కూడా విపరీతంగా ట్రోల్ చేస్తుండటం గమనార్హం. అయితే.. ఇలానే...ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ చేసిన కామెంట్స్ ని ఓ నెటిజన్ తప్పుగా అర్థం చేసుకొని ట్రోల్ చేశాడు. కాగా.. ఆ ట్రోలర్ కి స్టోక్స్ గట్టిగా సమాధానం చెప్పాడు. 

Also Read రూ.800కోట్ల ఆదాయం..కరోనా బాధితుకు రూ.లక్ష విరాళం.. ధోనీపై ట్రోల్స్..

ఇంతకీ మ్యాటరేంటంటే... ‘ నా తదుపరి కాంపిటేటివ్‌ క్రికెట్‌ ఏదైనా ఉందంటే అది ఐపీఎలే. అందుకోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నా.  ఐపీఎల్‌ కోసం ప్రాక్టీస్‌ కూడా మొదలు పెట్టేశా’ అని బెన్ స్టోక్స్ ఇటీవల ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ఐపీఎల్ జరుగుతుందో లేదా కూడా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో స్టోక్స్ ఇచ్చిన స్టేట్మెంట్ కి  ఓ అభిమాని కౌంటర్ ఇచ్చాడు.

నీ ఐపీఎల్‌ డబ్పులు కూడా లాక్‌డౌన్‌లో పడ్డాయ్‌. ఆ డబ్బుల్ని మరిచిపో. కరోనా వైరస్‌ నేపథ్యంలో అందరి కోసం ఆలోచించు’ అని విమర్శించాడు. ఆ కామెంట్స్ కి మండిపడ్డ స్టోక్స్.. అదే రీతిలో రీ కౌంటర్ ఇచ్చాడు.

’హెడ్‌లైన్స్‌ చూసి ఏదో మాట్లాడకు.. మొత్తం ఆర్టికల్‌ చదవి మాట్లాడు’ అంటూ మండిపడ్డాడు.  ఈ క్రమంలోనే  తన అన్న మాటల్ని ట్వీట్‌ చేశాడు. ఐపీఎల్‌ జరిగితే తాను సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని మాత్రమే చెప్పానంటూ కౌంటర్‌ ఎటాక్‌ చేశాడు