టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి.. మిస్టర్ కూల్ అనే పేరు ఉంది. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లడని.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడని అందరూ కితాబు ఇస్తారు. అలాంటి ధోనీ ఇప్పుడు తనకు తెలీకుండా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. దీంతో... అతనిని నెటిజన్లు.. ట్రోల్ చేస్తున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ ని అరికట్టేందుకు భారత ప్రభుత్వం 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కాగా.. కరోనా బాధితుల కోసం.. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు చాలా మంది సెలబ్రెటీలు తమ వంతు సహాయం చేస్తున్నారు.

Also Read ఐపీఎల్ జరగొచ్చేమో.., అది మ్యాజిక్.. పీటర్సన్ తో రోహిత్..

చాలా మంది సినీ ప్రముఖులు ఇప్పటి వరకు రూ.50లక్షలు, రూ.75లక్షలు, రూ.1కోటి విరాళంగా ప్రకటించారు. అయితే.. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ మాత్రం కేవలం రూ.1లక్ష మాత్రమే విరాళం ఇచ్చారు. దీంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

రూ.800కోట్ల ఆదాయం పెట్టుకొని.. కేవలం రూ.లక్ష మాత్రమేనా ఇచ్చేది అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పూణేలోని వంద కుటుంబాలకు ధోనీ రూ.లక్ష విరాళం ఇచ్చాడు.. కానీ అతని ఆదాయం మాత్రం రూ.800 కోట్లు అంటూ ట్విట్టర్ లో ట్వీట్స్ చేస్తున్నారు. ఇంకొకరేమో... అబ్బో చాలా ఎక్కువ ఇచ్చారే అంటూ వెంటకారంగా కామెంట్స్ పెడుతున్నారు. దక్షిణాది హీరీలు మీకన్నా చాలా నయం అంటూ కొందరు కామెంట్స్ చేయడం గమనార్హం.

మరి ఈ ట్రోల్స్ పై ధోనీ ఎలా స్పందిస్తాడో చూడాలి.ఇదిలా ఉండగా... బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. రూ.50లక్షల విలువచేసే బియ్యం విరాళంగా ఇవ్వగా.. శిఖర్ ధావన్, యూసూఫ్ పఠాన్ లు తమ వంతు సాయం చేశారు. తమ అభిమానులను సైతం సహాయం చేయాలని కోరారు.