Asianet News TeluguAsianet News Telugu

T20 World cup:ఇది కదా క్రీడా స్ఫూర్తి అంటే.. ధోనీ, కోహ్లీపై ప్రశసంల వర్షం..!

ఈ మ్యాచ్ లో ఓటమి తర్వాత.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమిండియా మాజీ కెప్టెన్, మెంటార్ మహేంద్ర సింగ్ ధోనీలు క్రీడా స్ఫూర్తి చూపించారు. మ్యాచ్  ఓటమి తర్వాత.. తమలో ఎంత బాధ ఉన్నా.. పాక్ జట్టు క్రికెటర్లను అభినందించి.. అందరి మనసులు గెలుచుకున్నారు.

Virat Kohli, MS Dhoni Interact With Pakistan Players After Defeat, Win Hearts On Social Media. See Pics
Author
Hyderabad, First Published Oct 25, 2021, 12:57 PM IST

T20 World cup లో భాగంగా ఆదివారం భారత్- పాక్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కచ్చితంగా భారత్ గెలుస్తుందని అందరూ ఆశపడ్డారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. మ్యాచ్ మొత్తం పాక్ సైడ్ అయిపోయింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కేవలం 151 పరుగులే చేయగలిగింది. అయితే.. తొలి బంతి నుంచి స్ట్రాంగ్ గా ఆడుకుంటూ వచ్చిన పాక్ జట్టుకి ఈ స్కోర్ సాధించడం పెద్ద కష్టమేమీ అనిపించలేదు. దాదాపు పది వికెట్ల తేడాతో.. టీమిండియా విజయం సాధించడం గమనార్హం.

 అయితే.. ఈ మ్యాచ్ లో ఓటమి తర్వాత.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమిండియా మాజీ కెప్టెన్, మెంటార్ మహేంద్ర సింగ్ ధోనీలు క్రీడా స్ఫూర్తి చూపించారు. మ్యాచ్  ఓటమి తర్వాత.. తమలో ఎంత బాధ ఉన్నా.. పాక్ జట్టు క్రికెటర్లను అభినందించి.. అందరి మనసులు గెలుచుకున్నారు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్( పీసీబీ) సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఆ ఫోటోలో కోహ్లీ.. రిజ్వాన్, బాబర్ అజామ్ లతొ మాట్లాడుతూ.. అభినందిస్తూ కనిపించాడు. దానికి క్రీడా స్ఫూర్తి( spirit of cricket)  అంటూ క్యాప్షన్ పెట్టడం గమనార్హం.

ఇక  అభిమానులు ఆ ఫోటోలు షేర్ చేయడం గమనార్హం.   కొందరు అభిమానులు.. ధోనీ కూడా.. పాక్ క్రికెటర్లను అభినందిస్తున్న ఫోటోలను షేర్ చేశారు. కాగా.. ధోనీ, కోహ్లీ.. లు మనసు గెలిచారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

ఇదిలా ఉండగా..పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. భారత్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 17.5 ఓవర్‌లలో ఛేదించింది. 
బాబర్ ఆజమ్ (68 నాటౌట్), మహ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. ఐసీసీ టోర్నమెంట్‌లలో పాకిస్తాన్.. భారత్‌పై గెలవడం ఇదే మొదటిసారి. ఈ ఓటమితో టీ20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు వెళ్లాలంటే దాదాపు అన్ని మ్యాచ్‌లూ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read: T20 Worldcup: ఇంత టెక్నాలజీ ఉండి ఏం పాయిదా.? అంపైర్లు నిద్రపోతున్నారా..? కెఎల్ రాహుల్ ఔట్ పై వివాదం

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను పాక్ బౌలర్లు వణికించారు. షాహీన్‌ అఫ్రిది దెబ్బకు ఓపెనర్లు రోహిత్ (0) కేఎల్‌ రాహుల్ (3) పెవిలియన్ చేరారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (11)తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ (57) ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే కుదురుకుంటున్న దశలో హసన్ అలీ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ ఔటయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన రిషభ్ పంత్ (39)తో కలిసి కోహ్లీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని షాదాబ్ విడదీశాడు. రిషభ్‌ భారీ షాట్‌కు యత్నించి షాదాబ్‌‌కే క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం రవీంద్ర జడేజా (13), హార్దిక్‌ పాండ్య (11) పరుగులు చేశారు. పాకిస్థాన్‌ బౌలర్లలో షాహీన్ 3, హసన్‌ అలీ 2, షాదాబ్‌ ఖాన్‌ ఒక వికెట్ పడగొట్టారు

Follow Us:
Download App:
  • android
  • ios