India vs pakistan: అబ్బో..!  టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఐసీసీ వాడుతున్న సాంకేతికతకు అందరూ ఆహా.. ఓహో అని మెచ్చుకున్నారు. ఇంతటి సాంకేతికతతో మ్యాచ్ ను వీక్షిస్తే ఆ మజానే వేరనుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నా భారత్ లో అభిమానులు మాత్రం ఇప్పుడు అలా ఫీలవడం లేదు.

ఇండియా-పాకిస్థాన్ (India vs Pakistan) మ్యాచ్ అంటేనే ఫ్యాన్స్ ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి. మ్యాచ్ గెలిచినా ఓడినా వారి రియాక్షన్ ను తట్టుకోవడం ఎవరి వల్లా కాదు. ప్రభుత్వాలు కూడా వారిని చూసీ చూడనట్టు వ్యవహరిస్తాయి. అయితే ఇంతటి బిగ్ మ్యాచ్ లో అంపైర్లు తప్పిదాలు చేస్తే మాత్రం..! అదీ కీలక వికెట్ అయితే ఇంక అంతే.. నిన్నటి భారత్ (India).. పాక్ (pakistan) పోరులో అలాంటి ఘటనే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 

స్టేడియంలో పదుల సంఖ్యలో కెమెరాలు.. హక్ ఐ టెక్నాలజీ.. 360 డిగ్రీల కోణంలో నుంచి మ్యాచ్ ను చిత్రీకరించే అత్యాధునిక వీడియో కెమెరాలు.. బంతి బ్యాట్ ను ముద్దాడిందా లేదా చూసే డీఆర్ఎస్.. అబ్బో..! టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఐసీసీ వాడుతున్న సాంకేతికతకు అందరూ ఆహా.. ఓహో అని మెచ్చుకున్నారు. ఇంతటి సాంకేతికతతో మ్యాచ్ ను వీక్షిస్తే ఆ మజానే వేరనుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నా భారత్ లో అభిమానులు మాత్రం ఇప్పుడు అలా ఫీలవడం లేదు. ముఖ్యంగా భారత ఓపెనర్ కె.ఎల్. రాహుల్ (KL Rahul) ఫ్యాన్స్ అయితే అస్సలు కావడం లేదు.. ఎందుకంటే.. 

ఆదివారం భారత్ తో పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా అంపైరింగ్ వ్యవహారం ఐసీసీకి ఇప్పుడు తలనొప్పిగా మారింది. ఆట మొదలయ్యాక తొలి ఓవర్లోనే పాక్ పేసర్ షహీన్ షా అఫ్రిది (shaheen afridi).. ఫామ్ లో ఉన్న భారత బ్యాట్స్మెన్ రోహిత్ (rohit sharma) ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తన తర్వాతి ఓవర్లో రాహుల్ ను కూడా బౌల్డ్ చేశాడు. ఇప్పుడు ఇదే ఔట్ నిర్ణయం అంపైర్, థర్డ్ అంపైర్ మెడకు చుట్టుకుంది. 

Scroll to load tweet…

Scroll to load tweet…

కెఎల్ రాహుల్ ఔటైన బంతి నో బాల్ అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ వారి ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు. ఈ ఫోటోలలో షహీన్.. నో బాల్ వేసినట్టు స్పష్టంగా ఉంది. 

Scroll to load tweet…

Scroll to load tweet…

కానీ అంపైర్ మాత్రం దీనిని చూడకుండా రాహుల్ ను ఔటిచ్చేశాడని ఇండియన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంపైర్, థర్డ్ అంపైర్ నిద్ర పోతున్నారా..? అంటూ మండిపడుతున్నారు. 

ఫీల్డ్ అంపైర్ తప్పు చేసి ఉండొచ్చు.. కానీ థర్డ్ అంపైర్ ఏం చేస్తున్నట్టు..? నిద్రపోతున్నాడా..? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివాన అయింది. వరుస ఓవర్లలో షహీన్.. రోహిత్, రాహుల్ ను ఔట్ చేసి భారత్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు. తొలి ఓవర్లో వెనుకపడ్డ భారత్.. మ్యాచ్ మొత్తం పుంజుకోలేదు.

భారత సారథి విరాట్ కోహ్లి (Virat Kohli) హాఫ్ సెంచరీతో అలరించినా.. మధ్యలో రిషభ్ పంత్ (Rishabh pant) మెరుపులు మెరిపించినా భారత్ ను ఆ ప్రదర్శనలు గెలిపించలేకపోయాయి. ఇక నిన్నటి మ్యాచ్ లో భారత బౌలర్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.