ఎప్పుడో మరీ ఒత్తిడిలో ఉన్నప్పుడు తప్ప... కోహ్లీ క్యాచ్ మిస్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. తాజాగా... గురువారం జరిగిన మ్యాచ్ లోనూ కన్ఫ్యూజన్ కి గురై కోహ్లీ క్యాచ్ మిస్ చేశాడు.
టీమిండియా మాజీ క్రికెటర్, ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ...మైదానంలోకి అడుగుపెట్టాడంటే చాలు రాకెట్ లా దూసుకుపోతాడు. పరుగుల వరద కురిపిస్తాడు. అందుకే కోహ్లీని రన్ మెషిన్ అని కూడా పిలుస్తారు. కేవలం పరుగులు తీయడమే కాదు... అద్భుతమైన క్యాచులు పట్టుకోవడంలోనూ కోహ్లీ ముందుంటాడు. ఎప్పుడో మరీ ఒత్తిడిలో ఉన్నప్పుడు తప్ప... కోహ్లీ క్యాచ్ మిస్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. తాజాగా... గురువారం జరిగిన మ్యాచ్ లోనూ కన్ఫ్యూజన్ కి గురై కోహ్లీ క్యాచ్ మిస్ చేశాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే.... గురువారం ఆర్సీబీ.. పంజాబ్ కింగ్స్ తో తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పంజాబ్ క్రికెటర్ జితేశ్ శర్మ బ్యాటింగ్ చేస్తూ 17వ ఓవర్ లో భారీ షాట్ ఆడాడు. డీప్ మిడ్ వికెట్ లో ఉన్న సుయాశ్ ప్రభుదేశాయ్ క్యాచ్ తీసుకుందామని పరిగెత్తాడు. ఇంతలో లాంగాన్ లో ఉన్న కోహ్లీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. కోహ్లీ తాను క్యాచ్ పట్టగలననే ధీమాతో... సుయాశ్ ని ఆగిపొమ్మని సైగ చేశాడు.
సుయాశ్ కూడా..కోహ్లీ క్యాచ్ పట్టగలడనే నమ్మకంతో కోహ్లీ చెప్పగానే ఆగిపోయాడు. అయితే... అనుకోకుండా కోహ్లీ ఆ క్యాచ్ ని పట్టినట్లే పట్టి వదిలేశాడు. చేతిలో నుంచి బాల్ జారిపోయింది. క్యాచ్ మిస్ అవ్వడంతో సుయాశ్ నిరాశకు గురయ్యాడు. ఆ నిరాశను కోహ్లీ ముందు చూపించాడు. మిస్ అయ్యిందని కోహ్లీ కాస్త నవ్వుతూ చెప్పడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కాగా... క్యాచ్ మిస్ అవ్వడంపై కామెంటేటర్ చెప్పిన మాటలు కూడ ఆకట్టుకుంటున్నాయి. కోహ్లీ దృష్టి దారి తప్పిందని.. అందుకు సుయేశ్ కారణమని.. ఆలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని కామెంటేటర్ అన్నాడు. కోహ్లీ సుయేశ్ సైగ చేసి.. ఇలోపు బాల్ పట్టుకునే క్రమంలో.. అది కాస్త మిస్ అయ్యిందని అర్థం వచ్చేలా కామెంటేటర్ కామెంట్ చేయడం గమనార్హం.
