ఫినిషర్ అవతారమెత్తిన ధోనీ (18 నాటౌట్: 6 బంతుల్లో 3x4, 1x6) బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో చెన్నై టీమ్‌ని గెలిపించాడు. ఈ విజయంతో ఐపీఎల్ 2021 సీజన్ ఫైనల్లో చెన్నై అడుగుపెట్టింది.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మళ్లీ ఫామ లోకి వచ్చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో.. ఫినిషర్ అవతారమెత్తిన ధోనీ (18 నాటౌట్: 6 బంతుల్లో 3x4, 1x6) బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో చెన్నై టీమ్‌ని గెలిపించాడు. ఈ విజయంతో ఐపీఎల్ 2021 సీజన్ ఫైనల్లో చెన్నై అడుగుపెట్టింది.

చెన్నై విజయానికి చివరి 12 బంతుల్లో 24 పరుగులు అవసరమవగా.. అప్పటి వరకూ ఛేదనలో టీమ్‌ని నడిపించిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (70: 50 బంతుల్లో 5x4, 2x6) ఔటైపోయాడు. దాంతో.. క్రీజులోకి వచ్చిన ధోనీ.. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో అవేష్ ఖాన్‌ బౌలింగ్‌లో ఓ చూడచక్కని సిక్స్‌తో పరుగుల ఖాతా తెరిచాడు. అదే ఓవర్‌లో మొయిన్ అలీ కూడా ఓ ఫోర్ కొట్టడంతో మొత్తం 11 పరుగులు వచ్చాయి. దాంతో.. గెలుపు సమీకరణం 6 బంతుల్లో 13 పరుగులుగా మారిపోయింది.

Scroll to load tweet…

చివరి ఓవర్‌లో టామ్ కరన్ బౌలింగ్‌కిరాగా.. మొదటి బంతికే మొయిన్ అలీ (16: 12 బంతుల్లో 2x4) ఔటైపోయాడు. అయితే.. ఒత్తిడిలోనూ మ్యాచ్‌లను ఎలా ఫినిష్ చేయాలో తెలిసిన ధోనీ.. వరుసగా రెండు, మూడు, నాలుగో బంతినీ బౌండరీకి తరలించేశాడు. మధ్యలో టామ్ కరన్ ఓ వైడ్ కూడా విసరడంతో.. రెండు బంతులు మిగిలి ఉండగానే చెన్నై టీమ్ విజయాన్ని అందుకుంది.

కాగా.. ధోనీ విజయం పట్ల కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కోహ్లీ ట్వీట్ చేయడం విశేషం. గేమ్ లో గ్రేటెస్ట్ ఫినిషర్ ఎప్పటికీ ధోనీనే అంటూ కోహ్లీ ట్వీట్ చేడయం గమనార్హం. కాగా.. ఈ ట్వీట్ కోహ్లీ, ధోనీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.