Asianet News TeluguAsianet News Telugu

Virat Kohli: ఈ విషయం డ్రెస్సింగ్ రూమ్ దాటి బయటకు పోవద్దు..! కోహ్లి నిర్ణయం టీమిండియాకు ముందే తెలుసా..?

Virat Kohli Quits Test Captaincy: ఈజీగా గెలవాల్సిన సౌతాఫ్రికా సిరీస్  ఓడిపోవడం మూలానో లేదంటే బీసీసీఐ తో వివాదాల వల్లో గానీ టీమిండియా  టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లి వైదొలగడం మరోసారి భారత క్రికెట్లో చర్చనీయాంశమైంది. 
 

Virat Kohli Had A Long Discussion With Head Coach Rahul Dravid before he Quitting Test Captaincy: Reports
Author
Hyderabad, First Published Jan 16, 2022, 1:55 PM IST

టెస్టు సారథిగా తప్పుకుని షాక్ ఇచ్చిన విరాట్ కోహ్లి ఈ నిర్ణయం హఠాత్తుగా తీసుకన్నదైతే కాదని వాదనలు వినిపిస్తున్నాయి.  దక్షిణాఫ్రికా తో సిరీస్ ఓడిపోవడమో..  వన్డే కెప్టెన్సీ వివాదం కారణంగానో కోహ్లి సారథ్య బాధ్యతల  నుంచి తప్పుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మరో సంచలన వార్త వెలగులోకి  వచ్చింది. సారథిగా తప్పుకోవాలన్నది కోహ్లి  అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని,  దానికంటే ముందే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో పాటు జట్టు సభ్యులకు ముందే తెలుసునని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

పలు నివేదికల ప్రకారం.. శనివారం ఉదయం రాహుల్ ద్రావిడ్ కు ఈ విషయాన్ని చెప్పిన కోహ్లి ఆ తర్వాత మధ్యాహ్నానికి  బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా కు తెలిపాడని సమాచారం. ఇంతకంటే ముందే కేప్టౌన్ లో టెస్టు ముగిసిన తర్వాతే అతడు జట్టు సభ్యులతో ఓ సమావేశం ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తున్నది. 

కేప్టౌన్ టెస్టు ముగిశాక అందరితో సమావేశమైన కోహ్లి.. ‘నేను టెస్టు కెప్టెన్ గా వైదొలగాలనుకుంటున్నాను..’అని  చెప్పాడట. అయితే అంతకంటే ముందే నాలుగైదు రోజుల ముందు కోహ్లి ఈ విషయాన్ని రాహుల్ ద్రావిడ్ కు చెప్పి అతడితో చర్చించాడని ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన ఓ కథనం ఆధారంగా తెలుస్తున్నది. కోహ్లి  ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరైన జట్టు సభ్యులలో ఒకరు  మాట్లాడుతూ.. ‘మీ అందరికీ నా చిన్న విన్నపం.. ఇక్కడ జరిగిందేదీ డ్రెస్సింగ్ రూమ్ దాటి బయటకు పోవద్దు.. ప్లీజ్..’ అని కోహ్లి కోరినట్టు చెప్పాడు. 

 

కేప్టౌన్  టెస్టుకు ముందే  తాను వైదొలగడంపై రాహుల్ ద్రావిడ్ తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని మరో జాతీయ ఛానెల్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. గతేడాది సెప్టెంబర్ లో టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగిన కోహ్లి.. డిసెంబర్ లో వన్డే సారథ్య బాధ్యతల నుంచి తొలగించబడ్డాడు. ఇక జనవరి 15న టెస్టు బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. 

 

2014 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా  మహేంద్ర సింగ్ ధోని నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకన్న కోహ్లి.. భారత్ ను  అన్ని ఫార్మాట్లలో విజయవంతంగా నడిపించాడు. 2014లో టెస్టు ర్యాంకులలో ఏడో స్థానంలో ఉన్న టీమిండియాను టెస్టులలో నెంబర్ వన్ ర్యాంకుకు తీసుకురావడంలో కోహ్లి పాత్ర ఎంతో ఉంది.  మొత్తంగా 68 టెస్టులలో సారథిగా వ్యవహరించిన  విరాట్.. ఏకంగా 40 విజయాలు సాధించాడు. 17 ఓటములు ఉన్నాయి. 58 శాతం విన్నింగ్ పర్సంటేజీ ఉన్న కోహ్లి.. ఈ జాబితాలో స్టీవ్ వా (71.92 శాతం), రికీ పాంటింగ్ (62.33 శాతం) ల తర్వాత నిలిచాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios