వెస్టిండీస్‌తో తొలి టెస్టులో ఫుల్లు ఎనర్జిటిక్‌గా కనిపించిన విరాట్ కోహ్లీ... డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ, ఇమిటేట్ చేస్తూ ఫన్నీగా ప్రవర్తిస్తూ... సోషల్ మీడియాలో వీడియోలు వైరల్..
పరుగులు చేసినా, చేయకపోయినా ప్రతీ మ్యాచ్‌ని పూర్తిగా ఎంజాయ్ చేయడానికి తెగ ఇష్టపడతాడు విరాట్ కోహ్లీ. డల్‌గా సాగుతున్న టెస్టుల్లో విరాట్ కోహ్ల డ్యాన్సులు చేస్తూ, ప్రేక్షకులను ఉత్సాహపరచడం చాలాసార్లు చూశారు క్రికెట్ ఫ్యాన్స్. తాజాగా వెస్టిండీస్ టూర్‌లో భాగంగా డొమినికాలో జరిగిన తొలి టెస్టులోనూ విరాట్ కోహ్లీ ఫుల్లు ఎనర్జిటిక్‌గా కనిపించాడు...
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన విరాట్ కోహ్లీ 182 బంతుల్లో 5 ఫోర్లతో 76 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ 171, రోహిత్ శర్మ 103 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 421 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది టీమిండియా..
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఫీల్డ్‌లో విరాట్ కోహ్లీ వేసిన వేషాలు అన్నీ ఇన్నీ కావు. బ్రేక్ టైమ్‌లో ఫన్నీ స్టెప్పులతో ఒంటరిగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసిన విరాట్ కోహ్లీ, ఓ క్యాచ్ ఆపే ప్రయత్నంలో కింద కూర్చుండిపోయాడు. ఆ తర్వాత కాసేపు అలాగే పిచ్ మీద పడుకుండిపోయి... సడెన్‌గా లేచి వింతగా ప్రవర్తించాడు విరాట్...
ఇంకోసారి ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్‌లను చూస్తూ వెకిలి నవ్వులు నవ్వుతూ, వెరైటీ చేష్టలు చేశాడు విరాట్ కోహ్లీ. ఫీల్డ్‌లో విరాట్ కోహ్లీ డైనమేట్‌లా కదలడం చాలా సార్లు చూసిందే. మిగిలిన ప్లేయర్లలో ఉత్సాహన్ని పెంచేందుకు డ్యాన్సులు చేయడం, ప్రేక్షకులను ఆనందింపచేయడం విరాట్‌కి అలవాటే. అయితే వెస్టిండీస్‌తో తొలి టెస్టులో మాత్రం విరాట్ కోహ్లీ ప్రవర్తన, ఓ యానిమేటెడ్ సిరీస్‌లో క్రేజీ క్యారెక్టర్‌ని చూస్తున్నట్టుగా అనిపించింది..
విరాట్ కోహ్లీ ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తొలి టెస్టులో 76 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, 147 బంతుల్లో కేవలం 2 ఫోర్లతో హాఫ్ సెంచరీ బాదడు. విరాట్ కెరీర్‌లో ఇది మూడో స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ. ఇంతకుముందు 2012లో నాగ్‌పూర్‌లో 171 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, 2022 కేప్‌టౌన్ టెస్టులో 159 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
విదేశాల్లో విరాట్ కోహ్లీకి ఇది 88వ 50+ స్కోరు. టీమిండియా తరుపున విదేశాల్లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు బాదిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ 96 సార్లు ఈ ఫీట్ సాధిస్తే, రాహుల్ ద్రావిడ్ (87 సార్లు)ని వెనక్కి నెట్టి, రెండో స్థానానికి ఎగబాకాడు విరాట్ కోహ్లీ..
