Asianet News TeluguAsianet News Telugu

సిరాజ్ చేసిన పనికి నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ..వీడియో..!

 టీమిండియా  బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ క్రమంలో శ్రీలకంతో మ్యాచ్ కి ముందు  భారత క్రికెట్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆరు మార్పులు చేసింది.

Virat Kohli Can't Keep Calm As Mohammed Siraj Runs To Stop Boundary On Own Bowling Against Sri Lanka In Asia Cup 2023 Final ram
Author
First Published Sep 18, 2023, 1:12 PM IST | Last Updated Sep 18, 2023, 1:12 PM IST

ఆసియా కప్ 2023 టైటిల్ ఫైనల్ ఫైట్, మూడు గంటల్లోనే ముగిసిపోయింది. ఇండియా- శ్రీలంక మధ్య హోరాహోరీ ఫైనల్ ఫైట్ చూడాలని ఆశపడిన క్రికెట్ ఫ్యాన్స్‌కి భారత జట్టు వన్ సైడ్ వార్ కనిపించింది. దీనికి కారణం మహ్మద్ సిరాజ్ . రెండో ఓవర్‌లో మెయిడిన్ వేసిన మహ్మద్ సిరాజ్, ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్.. మొత్తంగా 6 వికెట్లతో కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేసుకున్నాడు.ఈ ఇన్నింగ్స్ కారణంగా ఆసియా కప్ 2023 ఫైనల్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు.

ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో సిరాజ్ చేసిన పనికి విరాట్ కోహ్లీ రియాక్షన్ అదిరిపోయింది.  సిరాజ్ ఒకే  ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టిన తర్వాత, ధనంజయ డి సిల్వా సిరాజ్ నుండి పూర్తి డెలివరీకి కనెక్ట్ అయ్యాడు. స్క్వేర్ ముందు ఎక్కువ మంది ఫీల్డర్లు లేకపోవడంతో, ఫాస్ట్ బౌలర్ బౌండరీ వైపు పరుగెత్తాడు . అతను సేవ్ చేయలేకపోయినప్పటికీ, అతని ప్రయత్నం చూసి  కోహ్లీ నవ్వు ఆపుకోలేకపోయాడు.

కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ, శుభమన్ గిల్,  హార్దిక్ పాండ్యా సైతం సిరాజ్ బౌండరీ వైపు పరిగెత్తడాన్ని చూసి నవ్వుకున్నారు.  దీనికి ంసంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఆసియా కప్ 2023 ఫైనల్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు శ్రీలంకతో తలపడిన విషయం తెలిసిందే. అయితే, అంతక ముందు, టీమిండియా  బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ క్రమంలో శ్రీలకంతో మ్యాచ్ కి ముందు  భారత క్రికెట్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆరు మార్పులు చేసింది.

విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ , మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి రాగా, గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ని చేర్చారు. కాగా, ఈ మ్యాచ్లో వార్ వన్ సైడ్ అయిపోయింది. శ్రీలంక  కేవలం 50 పరుగులు మాత్రమే చేసింది. ఆ లక్ష్యాన్ని చేధించడానికి టీమిండియాకు ఎక్కువ సేపు పట్టలేదు.


భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (డబ్ల్యు), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(w), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(సి), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరణ.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios