దూకుడుగా మొదలుపెట్టారు కానీ.. మళ్లీ నిరాశపరిచిన రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ
T20 World Cup 2024, IND vs BAN : భారత్ తన మొదటి సూపర్ 8 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 47 పరుగుల తేడాతో విజయం సాధించగా, బంగ్లాదేశ్ తమదైన డిఎల్‌ఎస్ పద్ధతిలో ఆస్ట్రేలియాతో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్ లో రోహిత్-విరాట్ కోహ్లీలు టీమిండియాకు మంచి శుభారంభం అందించారు.
India vs Bangladesh : టీ20 ప్రపంచ కప్ 2024 లో భాగంగా భారత జట్టు తన రెండో సూపర్-8 మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్. దీంతో భారత ఓపెనింగ్ ప్రారంభించారు విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ జోడీ. మొదటి బాట్ నుంచే దూకుడుగా ప్రారంభించారు. రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీలు బిగ్ షాట్స్ ఆడారు. అయితే, రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్ ను పెద్ద ఇన్నింగ్స్ మార్చలేకపోయాడు. త్వరగానే పెవిలియన్ కు చేరాడు. 11 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 23 పరుగుల తన ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. కోహ్లీ-రోహిత్ జోడీ 39 పరుగుల భాగస్వామ్యం అందించింది.
మరో ఎండ్ లో కింగ్ కోహ్లీ కూడా దూకుడుగా ఆడాడు. సూపర్ సిక్సర్లతో అదరగొట్టాడు. కానీ, కోహ్లీ కూడా పెద్ద ఇన్నింగ్స్ ను ఆడలేకపోయాడు. తంజిమ్ హసన్ సాకిబ్ బౌలింగ్ 9వ ఓవర్ లో బిగ్ షాట్ ఆడబోయే వికెట్ల ముందు దొరికిపోయాడు. 37 పరుగుల తన ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ 1 ఫోరు, 3 సిక్సర్లు బాదాడు.
కోహ్లీ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికే భారీ సిక్సర్ కొట్టాడు. రెండో బంతికి బ్యాట్ ఎడ్జ్ కు బాల్ తగిలి కీపర్ కు వికెట్ రూపంలో దొరికిపోయాడు. దీంతో టీమిండియా 8.3 ఓవర్లలో 78 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది.
కాగా, టాస్ తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తాము ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామనీ, టాస్‌లో ఇరు జట్లు అనుకున్నది సాధించాయని చెప్పాడు. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతున్న ఈ మ్యాచ్ లో సెకండ్ బ్యాటింగ్ విజయాలు అధికంగా ఉన్నాయి. కాగా భారత్ తన మొదటి సూపర్ 8 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 47 పరుగుల తేడాతో విజయం సాధించగా, బంగ్లాదేశ్ తమదైన డిఎల్‌ఎస్ పద్ధతిలో ఆస్ట్రేలియాతో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది.
డేల్ స్టెయిన్ రికార్డును బద్దలు కొట్టిన ఆఫ్రికన్ బౌలర్ ఎవరో తెలుసా?