Virat Kohli: సఫారీల గడ్డపై విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు..  

Virat Kohli: దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా గ్రేట్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్రికెట్ హిస్టరీలో దిగ్గజ ఆటగాళ్లకు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నారు. సెంచూరియన్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఈ అద్బుత రికార్డును సృష్టించాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటీ?  

Virat Kohli Becomes The First Player To Complete 2000 Runs In 7 Calendar Years KRJ

Virat Kohli: టీమిండియా గ్రేట్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఫేమస్. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టులోని ఈ స్టార్ ప్లేయర్ ఇంతకు ముందు ఏ బ్యాట్స్‌మెన్ చేయలేని ఘనతను సాధించాడు. కుమార సంగక్కర, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాలు వెనక్కి నెట్టి సెంచూరియన్ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ అద్బుత రికార్డును సృష్టించాడు.

సెంచూరియన్‌లో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆధిక్యం కనబరుస్తుందని అందరూ భావించారు. తొలి రోజు టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు బౌలింగ్ చేస్తున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 245 పరుగులకే ఆలౌటైంది.

అనంతరం సఫారీ టీమ్ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు కూడా తొలుత తడబడిన డీన్ ఎల్గర్ పరుగుల సునామితో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇలా సౌతాఫ్రికా408 పరుగులు చేసి భారత్ పై 163 పరుగుల గణనీయమైన ఆధిక్యాన్ని సంపాదించారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగులడంతో మరోసారి విరాట్‌ కోహ్లి జట్టు బాధ్యతలు చేపట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. 

ఈ ఇన్నింగ్స్‌ ద్వారా ఒక క్యాలెండర్ ఇయర్ లో 7వ సారి 2000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు శ్రీలంకకు చెందిన కుమార సంగక్కరతో కలిసి 6 సార్లు ఈ ఫీట్‌ని సాధించిన విరాట్ ఇప్పుడు ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు 7 సార్లు 2000 కంటే ఎక్కువ పరుగులు చేయడం ద్వారా గొప్ప ఆటగాళ్లందరినీ విడిచిపెట్టాడు.

శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర ఒక క్యాలెండర్ ఇయర్ లో 6 సార్లు 2000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. అలాగే..  భారత గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ 5 సార్లు ఈ ఫీట్ చేయగా, శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే కూడా 5 సార్లు ఈ ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ కలిస్, ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ , ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హేడెన్ తలా 4 సార్లు ఈ ఘనత సాధించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios