ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా: ధోనీని దాటేసిన విరాట్ కోహ్లీ
బెంగళూరులో ఆస్ట్రేలియాపై జరిగిన మూడు వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఐదు వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా దాటిన కెప్టెన్ గా రికార్డులకు ఎక్కాడు.
బెంగళూరు: ఆస్ట్రేలియాపై బెంగళూరు వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు. మిచెల్ స్ట్రాక్ వేసిన 23వ ఓవరులో ఫోర్ కొట్టిన కోహ్లీ కెప్టెన్ గా వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయిని దాటిన ఘనత సాధించాడు.
తద్వారా విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఐదు వేల మైలురాయిని అత్యంత వేగంగా దాటిన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత్ తరఫున ఎంఎస్ ధోనీ, గంగూలీ, అజారుద్దీన్ కెప్టెన్లుగా ఐదు వేల మైలురాయిని దాటిన కెప్టెన్లుగా రికార్డులకు ఎక్కారు.
Also Read: బెంగళూరు వన్డే: ఏకపక్షం.. ఆసీస్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం, సిరీస్ కైవసం
ధోనీ 127 వన్డేల్లో ఐదు వేల పరుగుల మైలురాయిని దాటగా కోహ్లీ కేవలం 82 వన్డేల్లోనే ఆ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. పాంటింగ్ కు ఐదు వేల పరుగుల మార్కు దాటడానికి 131 ఇన్నింగ్సు అవసరమయ్యాయి.
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. అతను 136 ఇన్నింగ్సుల్లో కెప్టెన్ గా ఐదు వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు.
Also Read: కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ చూశారా: కళ్లు చెదిరే రీతిలో డైవ్ కొట్టి....
కీలకమైన మూడో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ 89 పరుగులు చేసి హాజిల్ వుడ్ బౌలింగులో అవుటయ్యాడు.
ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన 287 పరుగుల లక్ష్యాన్ని భారత్ 15 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగిపోయాడు.
Also Read: ఇండియాపై మ్యాచ్: స్మిత్ దెబ్బ, తిట్టుకుంటూ మైదానం వీడిన ఫించ్