కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ చూశారా: కళ్లు చెదిరే రీతిలో డైవ్ కొట్టి...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కళ్లు చెదిరే రీతిలో గాలిలో డైవ్ కొట్టి అందుకున్న క్యాచ్ తో లబుషేన్ షాక్ తిన్నాడు. కీలకమైన సమయంలో కోహ్లీ ఆ బంతిని అందుకుని ఆస్ట్రేలియాను దెబ్బ తీశాడు.
బెంగళూరు: ఆస్ట్రేలియాతో ఆదివారం జరుగుతున్న మూడో వన్డే మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టిన క్యాచ్ చూస్తే గుడ్లు తేలియకతప్పదు. కోహ్లీ అసాధ్యమనిపించే క్యాచ్ ను అద్బుతమైన రీతిలో అందుకున్నాడు.
కీలకమైన సమయంలో కోహ్లీ క్యాచ్ పట్టి ఆస్ట్రేలియాను దెబ్బ తీశాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింక్ చేసిన ఆస్ట్రేలియా 46 పరుగులకే ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. దాంతో స్టీవ్ స్మిత్ కలిసి లబుషేన్ ఇన్నింగ్సు ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
బౌండరీలు బాదుతూ స్కోరు లబుషేక్ స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. ఇరువురు కూడా అర్థ సెంచరీలు పూర్తి చేశారు. ఈ జోడీ 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ కు సవాల్ విసురుతున్న సమయంలో రవీంద్ర జడేజా లబుషేన్ ను అవుట్ చేశాడు. అయితే, లబు షేన్ ను అవుట్ చేసిన ఘనత జడేజా కన్నా ఎక్కువగా విరాట్ కోహ్లీకే దక్కుతుంది.
జడేజా వేిసన 32వ ఓవరు మూడో బంతిని లబు షేన్ కవర్ వైపు భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ కళ్లు చెదిరే రీతిలో డైవ్ చేసి రెండు చేతులా బంతిని గాలిలో అందుకున్నాడు. దాంతో షాక్ తిన్న లబుషేన్ పెవిలియన్ కు చేరుకున్నాడు.