విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా.. ఇన్ స్టాగ్రామ్ లో 200 మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకున్న తొలి భారతీయ క్రికెటర్ గా రికార్డు సాధించాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా అరుదైన రికార్డు సాధించాడు. మామూలుగానే విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా.. ఇన్ స్టాగ్రామ్ లో 200 మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకున్న తొలి భారతీయ క్రికెటర్ గా రికార్డు సాధించాడు.
ఈ నేపథ్యంలో.. కోహ్లీ తాజాగా.. తన ఇన్ స్టాగ్రామ్ లో స్పందించాడు. '200మిలియన్ స్ట్రాంగ్. ఇంత భారీ మద్దతు ఇస్తున్నందుకు ఇన్ స్టా ఫ్యామిలీకి ధన్యవాదాలు' అని కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇక 33ఏళ్ల విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్‌గా కూడా పేరుగాంచాడు. ఇక ఫుట్ బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో (450మిలియన్ల ఫాలోవర్లు), లియోనెల్ మెస్సీ (333మిలయన్ల ఫాలోవర్లు) తర్వాత ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న మూడో క్రీడాకారుడిగా పేరొందాడు.
సోషల్ మీడియాలో కోహ్లీ తరచూ యాక్టివ్‌గా ఉంటాడనే విషయం తెలిసిందే. కోహ్లీకి టీమిండియాలో అత్యంత ఫ్యాన్ బేస్ ఉంది. ఇక మొన్నమొన్నటి దాకా టీమిండియాకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. గత సంవత్సరం యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ వైఫల్యం తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తొలుత వైదొలిగిన కోహ్లీ ఆ తర్వాత వన్డేలకు, టెస్టులకు కూడా కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.
ఇక గత టీ20 ప్రపంచకప్ ఈవెంట్‌లో గ్రూప్ దశలోనే టీమిండియా పరాజయం పాలు కావడంతో కోహ్లీ మీద విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక టీమిండియా బ్యాటర్ రోల్‌లో తన సేవలు అందిస్తానని కోహ్లీ స్పష్టం చేశాడు. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా తాను జట్టుకు అవసరమైనంత మేర సేవలు అందించడానికి సదా సిద్ధంగా ఉంటానని రాజీనామా చేశాక తెలిపాడు. కోహ్లీ రిజిగ్నేషన్‌ను స్వీకరించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోహ్లీని కెప్టెన్‌గా తొలగించి రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించింది. ఇకపోతే జూన్ 9-19 మధ్య 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆడనుంది. ఇక ఈ సిరీస్‌లో ఆడనున్న జట్టుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను బీసీసీఐ ఎంపిక చేయకుండా విరామం ఇచ్చింది.
