ICC Test Rankings: రెండేళ్ల తర్వాత టాప్-10లోకి విరాట్ కోహ్లీ.. !

ICC Test Ranking: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు. టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. 

Virat Kohli back in top 10 of ICC Test Ranking krj

ICC Test Ranking: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. సెంచూరియన్ టెస్టులో హాఫ్ సెంచరీ సాధించాడు. కేప్‌టౌన్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేశాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి దూసుకెళ్లాడు. నెలరోజుల తర్వాత మళ్లీ టాప్ 10కి చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి 9వ స్థానానికి చేరుకున్నాడు. కానీ వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ కంటే ఒక స్థానం వెనుకబడి ఉన్నాడు. ఆల్‌రౌండర్ల టెస్టు ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఐసీసీ తాజా టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జో రూట్ రెండో స్థానంలో ఉండగా.. స్టీవ్ స్మిత్ మూడో స్థానంలో నిలిచారు. డారిల్ మిచెల్ మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలోకి వచ్చారు.  ఇక టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 4 స్థానాలు ఎగబాకి  9వ స్థానంలో నిలిచారు. 

టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ మినహా మరే ఇతర బ్యాట్స్‌మెన్ టాప్ 10లో చోటు దక్కించుకోలేదు. 2022లో కోహ్లి టాప్ 10 నుంచి ఔట్ అయ్యాడు. కానీ ఇప్పుడు తన మెరుగైన ప్రదర్శనతో మరోసారి టాప్ 10లో చోటు దక్కించుకున్నారు.  తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ 10 నుంచి 14వ ర్యాంక్‌కు పడిపోయాడు. రోడ్డు ప్రమాదంతో గతేడాదిగా జట్టుకు దూరంగా ఉన్న రిషభ్ పంత్ 15వ స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికాపై సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ 11 స్థానాలు ఎగబాకి 51వ ర్యాంక్‌లో నిలిచాడు.

టాప్ 5 టెస్ట్ ర్యాంకింగ్ (బ్యాట్స్ మెన్స్)
 

1. కేన్ విలియమ్సన్ - న్యూజిలాండ్ (864)
2. జో రూట్-  ఇంగ్లాండ్ (859)
3.  స్టీవ్ స్మిత్-  ఆస్ట్రేలియా (820)
4.  డారిల్ మిచెల్ - న్యూజిలాండ్ (786)
5. ఉస్మాన్ ఖవాజా- ఆస్ట్రేలియా (785) 

అశ్విన్ టాపర్

టెస్ట్ బౌలింగ్ విభాగంలో..సెంచూరియన్‌లో 41 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే తీసిన  రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అశ్విన్ రెండో స్థానంలో ఉండగా, శార్దూల్ ఠాకూర్ 34వ స్థానానికి పడిపోయాడు. టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ కంటే భారత్‌ 118 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

ఇక టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ దూసుకెళ్లాడు. రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ విభాగంలో ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో ఉన్నాడు. బిష్ణోయ్‌తో పాటు టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో ఏ భారత బౌలర్‌ కూడా చోటు దక్కించుకోలేదు.   

ఇక వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ మూడో స్థానంలో, రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం అగ్రస్థానంలో ఉన్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో ఉన్నాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios