ICC World cup 2023: వన్డే సెంచరీ నెం.50... సచిన్ గ్రౌండ్‌లో మాస్టర్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ..
India vs New Zealand: వన్డే కెరీర్‌లో 50వ సెంచరీతో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ... ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డు కూడా కైవసం..
![Virat Kohli 50th ODI Century in Sachin Tendulkar Home Ground, ICC World cup 2023 CRA Virat Kohli 50th ODI Century in Sachin Tendulkar Home Ground, ICC World cup 2023 CRA](https://static-gi.asianetnews.com/images/01hf9bbw3gt6wmb0ta1vh2qarn/whatsapp-image-2023-11-15-at-4-48-17-pm_363x203xt.jpg)
‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ సొంత మైదానంలో న్యూజిలాండ్‌తో వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సరికొత్త చరిత్ర లిఖించాడు విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ, కివీస్‌తో సెమీ ఫైనల్‌లో 50వ సెంచరీ అందుకుని... వరల్డ్ రికార్డు బ్రేక్ చేశాడు. ఈ సెంచరీతో 80 అంతర్జాతీయ సెంచరీలను కూడా పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ.
2019 నుంచి 2022 వరకూ మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి తీవ్రమైన ట్రోలింగ్ ఫేస్ చేసిన విరాట్ కోహ్లీ.. 2022 ఆసియా కప్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. గత 17 నెలల్లో విరాట్ కోహ్లీకి ఇది 10వ అంతర్జాతీయ సెంచరీ కూడా.
అంతకుముందు 20 ఏళ్లుగా ఎవ్వరికీ అందకుండా ఉన్న సచిన్ టెండూల్కర్ 673 పరుగుల రికార్డును అధిగమించి, సరికొత్త రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ.
ఇంతకుముందు 2007 వన్డే వరల్డ్ కప్‌లో మాథ్యూ హేడెన్ (659 పరుగులు), 2019 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ (648 పరుగులు), డేవిడ్ వార్నర్ (648 పరుగులు) చేసి సచిన్ టెండూల్కర్ రికార్డుకు దగ్గరగా వచ్చినా ఆ మ్యాజిక్ ఫిగర్‌ని మాత్రం అందుకోలేకపోయారు. సచిన్ టెండూల్కర్ 2003 వన్డే వరల్డ్ కప్‌లో 11 ఇన్నింగ్స్‌ల్లో 673 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లీ 10 ఇన్నింగ్స్‌ల్లోనూ ఆ రికార్డును బ్రేక్ చేసేశాడు.
ఒకే వరల్డ్ కప్‌లో అత్యధిక 50+ స్కోర్లు నమోదు చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు విరాట్ కోహ్లీ. 2003 వన్డే వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్, 2019లో షకీబ్ అల్ హసన్ 7 సార్లు, 50+ స్కోర్లు నమోదు చేశారు. విరాట్‌కి ఈ వరల్డ్ కప్‌లో ఇది 8వ 50+ స్కోరు..
త
ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ నిలిచాడు విరాట్ కోహ్లీ. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 731 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 740 పరుగులకు చేరుకున్నాడు.
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాప్ 3కి అధిగమించాడు విరాట్ కోహ్లీ. 13704 పరుగులు చేసిన రికీ పాంటింగ్‌ని దాటేసిన విరాట్ కోహ్లీ, 18426 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, 14234 పరుగులు చేసిన కుమార సంగర్కర తర్వాతి స్థానంలో నిలిచాడు.