వామిక ఫోటోలు లీక్.. అచ్చం కోహ్లీలాగా ఉందిగా..!
ఇప్పటి వరకు విరాట్ - అనుష్క దంపతులు.. మొదటి నుంచి వామిక ఫొటోలను బయటపడకుండా.. ఆమె మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ- బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలకు గతేడాది తల్లిదండ్రులుగా మారారు. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయం మనకు తెలిసిందే. పాప పుట్టి సంవత్సరం అవుతున్నా.. ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా.. ఇద్దరూ జాగ్రత్తపడ్డారు. అయితే.. తాజాగా.. వామిక ఫోటోలు లీక్ అయ్యాయి.
ప్రస్తుతం వామిక ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పటి వరకు విరాట్ - అనుష్క దంపతులు.. మొదటి నుంచి వామిక ఫొటోలను బయటపడకుండా.. ఆమె మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు వామిక ముఖం పూర్తిగా మీడియా కంట పడింది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సౌతాఫ్రికా పర్యటనకు కోహ్లీ సతీసమేతంగా వెళ్లాడు. ఇందులో భాగంగా మూడో వన్డేలో.. వామికా ఫేస్ కెమెరా కంటికి చిక్కింది. ఆ మ్యాచ్కు పాపతో కలిసి అనుష్క హాజరుకాగా అక్కడ వారిద్దరూ కలిసి ఉన్న దృశ్యం కెమెరాలో బందీ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో వైరల్గా మారింది.
వామిక.. సేమ్ విరాట్ లాగే ఉందని.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పాప చాలా క్యూట్ గా ఉందంటూ.. అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా వామిక ఫోటోలే కనిపిస్తుండటం గమనార్హం. కాగా.. కొందరు అభిమానునలు మాత్రం.. అలా వారి అనుమతి లేకుండా.. ఫోటోలు ఎలా లీక్ చేస్తారంటూ మండిపడుతున్నారు. ఇలా వామిక ఫోటోలు లీక్ చేయడం కరెక్ట్ కాదంటూ కోహ్లీ అభిమానులు తిట్టిపోస్తున్నారు.