Asianet News TeluguAsianet News Telugu

త్రీడీ ప్లేయర్ గోల్డెన్ డక్, ఆట మామూలుగా లేదుగా... విజయ్‌ శంకర్‌పై ట్రోల్స్!

4 పరుగుల తేడాలో 8 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

గోల్డెన్ డకౌట్ అయిన విజయ్ శంకర్...

రెండు నో బాల్స్, ఓ వైడ్‌తో కలిపి ఒక్క బంతికే 10 పరుగులిచ్చిన విజయ్ శంకర్...

విజయ్ శంకర్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు...

Vijay Shankar Failure effected SunRisers So bad against RCB CRA
Author
India, First Published Sep 22, 2020, 5:08 PM IST

IPL 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పరాజయంతో మొదలెట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సులువుగా విజయం సాధిస్తుందనుకున్న జట్టు, ఒక్కసారిగా ఆలౌట్ అయ్యి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. 121/2 స్కోరుతో ఉన్న సన్‌రైజర్స్, 34 పరుగుల తేడాలో 8 వికెట్లు కోల్పోయి, చెత్త రికార్డు నమోదుచేసింది.

భారీ స్కోరు చేస్తుందన్న ఆర్‌సీబీని, ఓ మాదిరి స్కోరుకే పరిమితం చేసినా... ఛేజింగ్‌లో మిడిల్ ఆర్డర్ ఘోరంగా ఫెయిల్ అయ్యింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమికి ప్రధాన కారణంగా విజయ్ శంకర్ కనిపిస్తున్నాడు.మిచెల్ మార్ష్ గాయపడడంతో అతని స్థానలో రెండు బాల్స్ వేయడానికి బంతి అందుకున్న విజయ్ శంకర్... రెండు నో బాల్స్‌, ఓ వైడ్‌తో కలిపి ఐదు బంతులు వేశాడు.

ఈ స్పెల్ కారణంగా ఒక్క బాల్‌లోనే ఆర్‌సీబీకి 10 పరుగులు వచ్చాయి. ఇరు జట్ల మధ్య ఓటమి తేడా కూడా ఇంతే. అదీగాక బెయిర్ స్టో అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్, ఎదుర్కొన్న మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

‘డకౌట్ కాకుండా అత్యధిక ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్ చేసిన భారత క్రికెటర్‌ను నేనేనంటూ గర్వంగా చెప్పుకున్న విజయ్ శంకర్, ఆ తర్వాత ఆడిన మొదటి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో నెట్‌లో విజయ్ శంకర్ ఆటతీరును విమర్శిస్తూ ట్రోల్స్ వినిపిస్తున్నాయి.

 

 

 

&

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios