టీమిండియా క్రికెటర్ విజయ్ శంకర్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఇక చాహల్.. కూడా ఇటీవలే తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు. నిశ్చితార్థపు ఫోటోలను షేర్ చేశాడు. కాగా.. ఇప్పుడు వీరి జాబితాలోకి విజయ్ శంకర్ కూడా చేరి పోయాడు.

విజయ్ శంకర్ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నాడు. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని.. నిశ్చితార్థం అయిపోయిందంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశాడు. కాబోయే భార్య వైశాలి విశ్వేశ్వరన్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. ఎంగేజ్‌మెంట్ జరిగిందని అర్థం వచ్చేలా ఉంగరం ఎమోజి జతచేశాడు. 

ఈ పోస్టుకు కామెంట్ల రూపంలో టీమిండియా క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్‌తో పలువురు ఆటగాళ్లు కంగ్రాట్స్ బ్రో అని కామెంట్ చేశారు. ఇక నెటిజన్లు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జంట చాలా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

💍 PC - @ne_pictures_wedding

A post shared by Vijay Shankar (@vijay_41) on Aug 20, 2020 at 8:41am PDT