దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఫ్యాన్స్ ఈ వీడియోని ఇప్పుడు తెగ షేర్ చేస్తున్నారు. 

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ తన 42వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఆయనకు పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు ప్రపంచ నలుమూలల నుంచి శుభాకాంక్షలు తెలియజేశారు. సచిన్ టెండుల్కర్, రిషబ్ పంత్ లాంటి క్రికెటర్లు సైతం బర్త్ డే విషెస్ ని తెలియజేశారు. ఇక ధోనీ అభిమానులు అయితే, ఆయనపై అభిమానాన్ని చాలా వినూత్నంగా చూపించారు. ప్రతిచోటా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు.

కాగా, తన పుట్టినరోజు నాడు ధోనీ సైతం తన అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు. తనను విష్ చేయడానికి వచ్చిన ఫ్యాన్స్ ని పలకరించాడు. తన ఇంటి టెర్రస్ పై కి ఎక్కి వారికి చేతులు ఊపాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఫ్యాన్స్ ఈ వీడియోని ఇప్పుడు తెగ షేర్ చేస్తున్నారు.

1981 జులై 7న జన్మించిన ధోనీ క్రీడా చరిత్రలో చెరిగిపోని ముద్ర వేశాడు. రాంచీలో జన్మించిన మహేంద్రసింగ్ ధోనీ దేశవాళీ క్రికెట్లో సత్తాచాటి టీమిండియాకు ఎంపికయ్యాడు. దానికి ముందు ఆయన చాలా కష్టాలు పడ్డాడు. రైల్వే స్టేషన్ లో టికెట్ కలెక్టర్ గా పని చేసి, ఆ తర్వాత టీమిండియాకు కెప్టెన్ అయ్యే స్థాయికి ఎదిగాడు.

Scroll to load tweet…


 జట్టును ICC T20 ప్రపంచ కప్ 2007, ICC క్రికెట్ ప్రపంచ కప్ 2011, ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2013కి కెప్టెన్‌గా నడిపించాడు. ఐసీసీ మూడు పెద్ద ఈవెంట్లలో ట్రోఫీ అందుకున్న ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు మహేంద్ర సింగ్ ధోనీ. 2007లో ఐసీసీ టీ-20 వరల్డ్‌ కప్‌, 2011లో ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌, 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని ధోనీ నాయకత్వంలోనే టీమిండియా గెలుచుకుంది. ధోనీ కెప్టెన్సీలో తొలిసారిగా టీ-20 వరల్డ్ కప్‌లో బరిలోకి దిగిన టీమిండియా.. ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది.

అతను 2004లో తన అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. క్రికెట్ చరిత్రలో తనను తాను పెద్ద హిట్టర్‌గా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. ది బెస్ట్ కెప్టెన్ గా కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇలా ధోనీ కెరీర్ లో మైలు రాయులు చాలానే ఉన్నాయి.