క్రికెట్ కాదు టెన్నిస్.. ధోనీ-రిషబ్ పంత్ వీడియో వైరల్
MS Dhoni-Rishabh Pant: దుబాయ్‌లోని కోకకోలా ఎరీనాలో ఐపీఎల్ 2024 వేలం ప్రక్రియ ముగిసిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టెన్నిస్ ఆడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
MS Dhoni-Rishabh Pant’s Playing Tennis: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టెన్నిస్ ఆడుతున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఐపీఎల్ 2024 వేలం ముగిసిన తర్వాత వీరు టెన్నిస్ ఆడుతున్నట్టుగా తెలుస్తోంది. మంగళవారం దుబాయ్ లోని కోకకోలా ఎరీనాలో ఐపీఎల్ 2024 వేలం ప్రక్రియ ముగిసిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టెన్నిస్ ఆడుతున్న వీడియోను ఒక నెటిజన్ షేర్ చేశారు. ఇప్పటికే ఈ ఇద్దరు క్రికెటర్ల పాపులారిటీ కారణంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను కొంతకాలం క్రికెట్ కు దూరం చేసిన ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు పంత్. ప్రస్తుతం అతను పూర్తిగా ప్రమాద గాయాల నుంచి కోలుకోవడం క్రికెట్ అభిమానులకు శుభవార్తే.
ఇక భారత మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని కూడా ఐపీఎల్ వేలం కోసం చెన్నై ఫ్రాంఛైజీతో కలిసి దుబాయ్ వెళ్లారు. ఐపీఎల్ వేలం ముగిశాక ధోని, రిషబ్ పంత్ లు టెన్నిస్ ఆడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రికెట్ లవర్స్ నుంచి కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలావుండగా, ఐపీఎల్ 2024 వేలానికి ముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషబ్ పంత్ మాట్లాడుతూ.. "నేను బతికి ఉన్నందుకు అదృష్టవంతుడిని, నేను పెద్ద ప్రమాదమే ఎదుర్కొన్నాను. ప్రమాదం నుంచి కోలుకోవడం చాలా సవాలుగా సాగింది. ప్రారంభంలో చాలా బాధను భరించవలసి వచ్చింది. కానీ ఇప్పటి వరకు ప్రయాణాన్ని చూస్తే, రికవరీ పాయింట్ నుండి ఇది చాలా బాగా సాగుతుందని నేను భావిస్తున్నానని" చెప్పారు.
IPL 2024: ఏ జట్టులో ఎవరెవరు ఉన్నారు.. ? 10 టీమ్స్ ప్లేయర్స్ వీరే..