Asianet News TeluguAsianet News Telugu

మరోసారి కోహ్లీపై విరుచుకుపడ్డ గంభీర్...

భారత జట్టు మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ మరోసారి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విరుచుకుపడ్డాడు. కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడని మరోసారి ఈ ఐపిఎల్ ద్వారా రుజువయ్యిందని అన్నారు. అయినా కూడా బెంగళూరు యాజమాన్యం అతన్ని ఇంకా కెప్టెన్ గా ఎలా వుంచుతుందో తనకు అర్థం కావడం లేదన్నారు. అయితే అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో టీమిండియా మెరుగ్గా రాణించాలంటే కెప్టెన్ బాధ్యతల నుండి కోహ్లీని తొలగించాలని  గంభీర్ డిమాండ్ చేశాడు.

veteran cricketer gambhir fires on kohli
Author
New Delhi, First Published May 1, 2019, 5:48 PM IST

భారత జట్టు మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ మరోసారి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విరుచుకుపడ్డాడు. కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడని మరోసారి ఈ ఐపిఎల్ ద్వారా రుజువయ్యిందని అన్నారు. అయినా కూడా బెంగళూరు యాజమాన్యం అతన్ని ఇంకా కెప్టెన్ గా ఎలా వుంచుతుందో తనకు అర్థం కావడం లేదన్నారు. అయితే అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో టీమిండియా మెరుగ్గా రాణించాలంటే కెప్టెన్ బాధ్యతల నుండి కోహ్లీని తొలగించాలని  గంభీర్ డిమాండ్ చేశాడు.

గతంలోనూ ఇలాగే కోహ్లీపై, అతడి కెప్టెన్సీపై గంభీర్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. 2011 నుండి ఆర్సిబి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కోహ్లీ  ఈ తొమ్మిదేళ్లలో ఒక్కసారి కూడా జట్టుకు ట్రోపిని అందిచలేకపోయాడని విమర్శించాడు. దీన్ని బట్టే అతడెంత చెత్త కెప్టెనో అర్థమవుతుందన్నారు. అయినా కూడా కోహ్లీ ఆర్సిబి కెప్టెన్ గా ఇంకా  కొనసాగుతున్నాడంటే అది అతడి అదృష్టమేనని గంభీర్ పేర్కొన్నాడు. 

ఇలా కోహ్లీ కెప్టెన్సీని ఓవైపు విమర్శిస్తూనే మరోవైపు వ్యక్తిగత ప్రదర్శన విషయంలో అతన్ని మించినవారు లేరంటూ గంభీర్ ప్రశంసించాడు. ప్రపంచ క్రికెట్లో కోహ్లీని మించిన బ్యాట్ మెన్ మరొకరు లేరనడంలో అతిశయయోక్తి ఏమీ లేదన్నాడు. భారత ఆటగాడిగా అతడు సాధించిన పరుగులు,రికార్డులు, జట్టుకు అందించిన విజయాలు చాలా గొప్పవని...ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారన్నారు. కానీ అతడి కెప్టెన్సీని మాత్రం ఒప్పుకునే ప్రసక్తేలేదని గంభీర్ అన్నాడు.   

ఇక ఈ సీజన్ ను మొదట వరుస విజయాలతో ఆరంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ చివర్లో వరుస  ఓటములను చవిచూడటంపై గంభీర్ స్పందించాడు. కెకెఆర్ ఈ సీజన్లో అత్యంత చెత్తగా ఆడిందన్నాడు. అయితే వరుస ఓటముల నుండి బయటపడి మిగిలిన రెండు మ్యాచుల్లోనూ కెకెఆర్ గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఇలా కెకెఆర్ ప్లేఆఫ్ చేరడం ఖాయమని గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు. 

సంబంధిత వార్తలు

విరాట్ కోహ్లీ అంత గొప్ప కెప్టెనేం కాదు: గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎలా జడ్జ్ చేస్తారు..? గంభీర్ కి కోహ్లీ కౌంటర్

విరాట్ కోహ్లీ ఓ చెత్త కెప్టెన్...కానీ: గంభీర్ ఘాటు వ్యాఖ్యలు

Follow Us:
Download App:
  • android
  • ios