ఆర్కిటెక్చర్‌లో స్థిరమైన ఉద్యోగాన్ని వదులుకుని క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న వరుణ్ చక్రవర్తి ప్రయాణం ఎంతో అసాధారణం. ఓ సాధారణ మీడియం పేస్ బౌలర్‌గా ప్రారంభమైన అతని ఆట, చివరకు "మిస్టరీ స్పిన్నర్"గా భారత క్రికెట్‌కు ఒక కొత్త అసెట్ గా మారాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) ద్వారా తన టాలెంట్‌ను నిరూపించుకుని, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అద్భుత ప్రదర్శన ఇచ్చిన వరుణ్, జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు.

భారత క్రికెట్‌లో కొన్ని స్పెషల్ స్టోరీలు ఉంటాయి. వాటిలో ఒకటివరుణ్ చక్రవర్తిజీవితం. చాలా మంది చిన్నప్పటి నుంచే క్రికెట్‌ను ప్రొఫెషనల్ కెరీర్‌గా ఎంచుకుంటారు. కానీ, వరుణ్ కేస్ పూర్తిగా భిన్నం. అసలు క్రికెట్ కెరీర్ గురించి ఆలోచించకుండా, అతనుఆర్కిటెక్చర్‌లో డిగ్రీపూర్తిచేశాడు. కొన్నాళ్ల పాటు ఒక ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్‌గా కూడా పనిచేశాడు. కానీ, తన మనసు పూర్తిగా క్రికెట్ వైపేఉండేది. తను సరిగ్గా ఆలోచించినప్పుడు, తన అసలైన కల క్రికెటర్ కావడమేనని గ్రహించాడు. ఆ నిర్ణయంతోనే అతని జీవితం మలుపు తిరిగింది.

ఆదిలో మీడియం పేస్ బౌలర్,, ,తర్వాత మిస్టరీ స్పిన్నర్

వరుణ్ తొలి రోజుల్లోమీడియం పేస్ బౌలర్‌గా ఆడేవాడు. కానీ, తర్వాత స్పిన్ బౌలింగ్ వైపు మారాడు. ఇది అతని కెరీర్‌కు మలుపు తిప్పిన నిర్ణయం. మామూలు స్పిన్నర్ల మాదిరిగా కాకుండా, అతని బౌలింగ్ శైలి పూర్తిగా విభిన్నం. కొత్త కొత్త డెలివరీలు ప్రయత్నించడం, బ్యాట్స్‌మెన్‌ను ఆశ్చర్యపరచడం అతని స్పెషాలిటీ.ఒకేసారి 7 రకాల బంతులు వేసే సామర్థ్యంఅతనికి ఉంది. అందుకే అతనికి "మిస్టరీ స్పిన్నర్" అనే పేరు వచ్చింది.

TNPL ,ద్వారా వెలుగులోకి వచ్చిన టాలెంట్

అతని ప్రతిభను మొదట గుర్తించిందితమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL). అక్కడ వరుణ్ తనఅద్భుతమైన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని మ్యాచులు చూసిన సెలక్టర్లు, ఈ ఆటగాడిని తక్కువ అంచనా వేయలేంఅని భావించారు.TNPLలో అతను అందరినీ షాక్‌లో ముంచెత్తే ప్రదర్శన ఇచ్చాడు. దీంతో, అతని దారిఐపీఎల్‌కు (IPL)చేరింది.

IPL‌,లో భారీ డీల్ – వరుణ్ గర్వించదగ్గ మైలురాయి

2019లో జరిగిన IPL వేలంలో, కింగ్స్ XI పంజాబ్అతన్నిరూ. 8.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది అప్పటికి ఒక కొత్త ప్లేయర్‌కి చాలా భారీ మొత్తం. కానీ, ఆ సీజన్‌లో ఎక్కువ అవకాశాలు రాలేదు. తక్కువ మ్యాచ్‌ల్లో ఆడటంతో, తన ప్రతిభను నిరూపించుకోలేకపోయాడు.

అయితే, ఈ నిరాశతో వెనక్కి తగ్గలేదు.కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అతనిపై నమ్మకం పెట్టుకుంది. 2020లో KKR ప్లేయర్లు జట్టులో చేర్చుకున్నారు. ఇదే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

KKR‌,తో మేజిక్ స్పిన్ – వరుణ్ కెరీర్లో మలుపు

KKR తరఫున ఆడిన మొదటి సీజన్‌లోనే, అతను అసలైన ‘మిస్టరీ స్పిన్నర్’గా పేరుపొందాడు. వరుణ్ స్టైల్ చూసిన ప్రతి ఒక్కరూ"ఇతని బౌలింగ్‌ను డికోడ్ చేయడం అసాధ్యం"అనే స్థాయికి వెళ్లిపోయారు. బ్యాట్స్‌మెన్ అతని బౌలింగ్‌ను అర్థం చేసుకునే లోపే, వారి వికెట్లు పడిపోయేవి.

భారత జట్టులో అవకాశం – వరుణ్ కల నిజమైన రోజు

2020లో, భారత జట్టుకు తొలిసారి ఎంపిక అయ్యాడు. ఇది అతనికి నిజమైన కల లాంటి విషయం. ఒకప్పుడుఆఫీసులో కంప్యూటర్‌పై పని చేసిన వ్యక్తి, ఇప్పుడు భారత జెర్సీలో అడుగుపెట్టాడు. అతని మిస్టరీ స్పిన్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే, అంతా అతని అనుకూలంగా మాత్రం లేదు.T20 వరల్డ్ కప్‌లో అతను పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఫలితంగా జట్టులో స్థానం కోల్పోయాడు. కానీ, దీనిని ఓటమిగా భావించలేదు.మూడు సంవత్సరాలు కష్టపడి, 2024లో తిరిగి భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

తాజా గేమ్‌లో సూపర్ రీఎంట్రీ – న్యూజీలాండ్ పై ,5, వికెట్లు

భారత జట్టులో మళ్లీ అవకాశాన్ని అందుకున్న వరుణ్, చాంపియ్సన్ ట్రోఫీలో న్యూజీలాండ్ పై 5 వికెట్లు తీయడంతోతన టాలెంట్ ని మరోసారి నిరూపించాడు. ఇది అతనికి మరోసారి రీబూత్ లాంటి అవకాశం. ఇప్పుడు అతను మళ్లీ భారత స్పిన్ విభాగంలో ప్రధాన ఆటగాడిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. 

కర్ణాటకలోని బీదర్ లో ఓ మధ్య తరగతి కుటుంబంలో వరుణ్ చక్రవర్తి జన్మించాడు.

వరుణ్ చక్రవర్తి జీవితం – యువ క్రికెటర్లకు ఓ గొప్ప ప్రేరణ

వరుణ్ చక్రవర్తి కథ ఒక్క క్రికెట్ కోణంలోనే కాకుండా, ఏ రంగంలో ఉన్నా మనసులో ఉన్న కలను నమ్ముకుంటే విజయం సాధించవచ్చనే సందేశంఇస్తుంది.

అతనుకంప్యూటర్ స్క్రీన్ ముందు నుంచి, క్రికెట్ మైదానం వరకూ వచ్చిన ప్రయాణంప్రతి యువ క్రికెటర్‌కి ఒక స్పూర్తిదాయక గాథ. తన కలను నమ్ముకున్నాడు. దాని కోసం లైఫ్‌లో పెద్ద రిస్క్ తీసుకున్నాడు. చివరకు, భారత క్రికెట్‌లో ఒక ప్రత్యేకమైన ఆటగాడిగా పేరు సంపాదించాడు.