వరుణ్ చక్రవర్తి... ఐపీఎల్‌లో మెరిసిన ఈ యంగ్ స్పిన్నర్‌ను ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపిక చేశారు సెలక్టర్లు. అయితే ఇంతలో ఏమైందో ఏమో గాయం కారణంగా వరుణ్ చక్రవర్తి స్థానంలో టి నటరాజన్‌కి చోటు దక్కింది. అనుకోకుండా జట్టులోకి వచ్చిన నటరాజన్, చివరి వన్డేతో పాటు టీ20 సిరీస్‌లో అదరగొట్టి ఆస్ట్రేలియాకి షాక్ ఇస్తే... గాయంతో టూర్‌కి దూరమైన వరుణ్ చక్రవర్తి పెళ్లి చేసుకుని ఇండియన్స్‌కి షాక్ ఇచ్చాడు. 

తమిళనాడు రాష్ట్రానికి చెందిన వరుణ్ చక్రవర్తి, హీరో విజయ్‌కి వీరాభిమాని. విజయ్ మీద అభిమానంతో ఆయన పేరుని కూడా పచ్చబొట్టు వేసుకున్నాడు. ఐపీఎల్ తర్వాత తన ఫేవరెట్ హీరోని కలిసి ఫోటో దిగిన వరుణ్ చక్రవర్తి, డిసెంబర్ 11న పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు.

ఐపీఎల్ 2020లో 17 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి పెళ్లికి  కొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడిన వరుణ్ చక్రవర్తి, నిజంగానే గాయంతోనే ఆసీస్ టూర్‌కి దూరంగా ఉన్నాడా? లేక పెళ్లి కోసమే గాయం సాకు చెప్పాడా? అని అనుమానిస్తూ ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు కొందరు ఫ్యాన్స్.