ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే వాఖండే గ్రౌండ్ సిబ్బంది, ముగ్గురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఐపీఎల్ యాజమాన్యం, బీసీసీఐ. దీంతో పీఎస్ఎల్‌లాగా ఐపీఎల్ 2021 సీజన్‌కి కరోనా కారణంగా మధ్యలోనే బ్రేకులు పడతాయని అనుమానిస్తున్నారు క్రికెట్ అభిమానులు. 

దీంతో ఐపీఎల్ ఆరంభానికి ముందే ప్లేయర్లందరికీ వ్యాక్సినేషన్ వేయించాలని ప్రయత్నిస్తోంది బీసీసీఐ. బయో బబుల్ సెక్యూలర్ జోన్ ఏర్పాటు చేస్తున్నా, 56 రోజుల పాటు సుదీర్ఘ సీజన్‌ కారణంగా ప్లేయర్లను, గ్రౌండ్ సిబ్బందిని, సహాయ సిబ్బందిని కాచుకుని కూర్చోవడం చాలా కష్టతరం కానుంది.

దీంతో లీగ్ ఆరంభానికి ముందే కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్లేయర్లకు వ్యాక్సిన్ వేయించాలని ఆలోచిస్తోంది బీసీసీఐ. అయితే దీనికి కేంద్రం అనుమతి రావాల్సి ఉంది. కేంద్ర అనుమతి రాగానే స్వదేశీ ప్లేయర్లు అందరికీ వ్యాక్సిన్ వేయిస్తారు. అలాగే అంగీకరిస్తే విదేశీ ప్లేయర్లకు కూడా కరోనా వ్యాక్సిన్ చేస్తారు...