వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరగనున్న అండర్ 19 క్రికెట్ వరల్డ్‌కప్ కోసం క్వాలిఫికేషన్ రౌండ్స్‌ను రీషెడ్యూల్ చేసింది ఐసీసీ. నిజానికి ఇదే ఏడాది ఈ టోర్నీ క్వాలిఫికేషన్ రౌండ్స్ ప్రారంభం కావాల్సిఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా 8 నెలల పాటు క్రికెట్‌కి బ్రేక్ పడడంతో అండర్ 19 వరల్డ్‌కప్ కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడింది.

2020 వరల్డ్‌కప్ ఈవెంట్‌లో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం ఆఫ్ఘాన్‌తో పాటు బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, టీమిండియా, న్యూజిలాండ్, పాక్, శ్రీలంక, జింబాబ్వే జట్లు 2022 అండర్ 19 వరల్డ్‌కప్‌కి నేరుగా అర్హత సాధించాయి. ఆతిథ్యం ఇవ్వనున్న విండీస్ కూడా నేరుగా అర్హత సాధించింది. ఈ 11 జట్లు కాకుండా మరో ఐదు జట్లు అండర్ 19 వరల్డ్‌కప్ ఆడతాయి.

ఈ ఐదు స్థానాల కోసం 33 జట్లు క్వాలిఫికేషన్ రౌండ్‌లో పోటీపడబోతున్నాయి. ఆఫ్రికా, ఐరోసా, అమెరికా, ఆసియా డివిజన్‌ల నుంచి జరిగే ఈ అర్హత రౌండ్లకి నైజీరియా, స్కాట్లాండ్, జపాన్, అమెరికా, యూఏఈ ఆతిథ్యం ఇస్తాయి.