అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

సచిన్ టెండూల్కర్: భారత క్రికెట్‌‌ ఎదుగుదలలో ధోనీ సహకారం ఏంతో ఉందని.. ఆయనతో కలిసి 2011 ప్రపంచకప్ గెలవడం తన జీవితంలో ఉత్తమ క్షణం. జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్‌‌ ప్రారంభించబోతున్న నీకు, నీ కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు.

 

 

మైఖేల్ వాన్: 2011 ప్రపంచకప్‌ను గెలిచి సచిన్ టెండూల్కర్‌కు టీమిండియా మంచి వీడ్కోలు అందించడం వెనుక సూత్రధారి ధోనియే. ఎంత అద్భుతమైన క్రికెట్ కెరీర్.. ధోనీ గొప్ప వైట్ బాల్ కెప్టెన్ అలాగే బెస్ట్ ఫినిషర్.
 

 

రవిచంద్రన్ అశ్విన్: దిగ్గజం ఎప్పుడూ తనదైన శైలిలోనే పదవీ విరమణ చేస్తుంది. ధోనీ భాయ్... మీరు దేశానికి ఛాంపియన్స్ ట్రోఫీ, 2011 ప్రపంచకప్, చెన్నైకి ఐపీఎల్ విజయాలు ఇచ్చారు. ఇవన్నీ నాకు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.  

 

 

కెవిన్ పీటర్సన్: ‘‘ పదవి విరమణ చేసిన వారి క్లబ్‌కు మీకు స్వాగతం’’

 

 

ఇషా గుహా: నమ్మశక్యం కాని కెరీర్‌కు అభినందనలు. టీ 20, వన్డే ప్రపంచకప్‌‌లను అందించిన కెప్టెన్, టెస్టుల్లో భారత్‌ను నెంబర్ స్థానానికి తీసుకెళ్లాడు. సీట్ల అంచున మమ్మల్ని నిలబెట్టిన వ్యక్తి.  

 

 

శిఖర్ ధావన్: కెప్టెన్, లీడర్, లెజెండ్.. మీరు దేశం కోసం చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు మహీభాయ్ 

 

 

కృష్ణామాచారి శ్రీకాంత్: ధోనీ నీ అద్భుతమైన కెరీర్‌‌కు అభినందనలు. నువ్వు క్రికెట్ మైదానంలోని అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడివి. నీతో కొన్ని ప్రత్యేక సందర్భాలను పంచుకున్నాను. తర్వాతి ఇన్నింగ్స్‌లోనూ మీరు, మీ కుటుంబసభ్యులు విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను.  

 

 

ఇర్ఫాన్ పఠాన్: క్రికెట్‌లో దేశానికి ఎన్నో విజయాలను అందించిన ఓ స్నేహితుడు, ఓ క్రికెటర్‌తో కలిసి ఆడటం నాకు దక్కిన గౌరవం