డేవిడ్ వార్నర్ కొట్టిన బౌండరీని ఆపేందుకు ప్రయత్నించిన ట్రెంట్ బౌల్ట్...బంతి దూసుకుపోతుండగా గాల్లో చేతులు ఊపుతూ... డ్రైవ్ చేసేందుకు ప్రయత్నం...సోషల్ మీడియాలో ట్రెంట్ బౌల్ట్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు...

క్రికెట్ క్రీజులో కొన్ని సంఘటనలు కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. ముంబై ఇండియన్స్ ప్లేయర్ ట్రెంట్ బౌల్ట్ ఇలాంటి ఫీల్డింగ్ విన్యాసంతోనే నెటిజన్లకు టార్గెట్ అయ్యాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ కొట్టిన ఓ షాట్‌, బౌండరీ దిశగా సాగుతుండగా... దాన్ని ఛేజ్ చేస్తూ వెనకాలే పరుగెత్తాడు ట్రెంట్ బౌల్ట్.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే బంతి వేగంగా దూసుకుపోతుండడంతో డైవ్ చేయాలా? వద్దా? అనే ఆలోచనతో గాల్లోనే చేతులు ఊపాడు ట్రెంట్ బౌల్ట్.. ఆఖరికి బంతిని ఆపేందుకు దూకినా... అప్పటికే అది బౌండరీ చేరింది.

Scroll to load tweet…

పడాలా? వద్దా? అని ట్రెంట్ బౌల్ట్ చేసిన ప్రయత్నం చూడడానికి ఫన్నీగా ఉండడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాడు. కొన్నిరోజుల క్రితం సర్ఫింగ్ చేసిన ట్రెంట్ బౌల్ట్, ఇప్పుడు మైదానంలో దాన్ని చేసి చూపించాడని ఫన్నీ పోస్టులు పోస్టు చేస్తున్నారు నెటిజన్లు.