Heinrich Klaasen : బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్లు దుమ్మురేపారు. ట్రావిస్ హెడ్ సెంచరీతో అదరగొట్టగా, హెన్రిచ్ క్లాసెన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అయితే, క్లాసెన్ దెబ్బకు రికార్డు సిక్సర్ తో బాల్ స్టేడియం బయట పడింది.
IPL 2024 RCB vs SRH : పరుగుల సునామీ అంటే ఇదే అనేలా బ్యాట్ పవర్ చూపించారు హైదరాబాద్ ప్లేయర్లు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. వచ్చినవారు వచ్చినట్టుగా బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో ఎలారా మిమ్మల్ని ఆపేది అనేలా బెంగళూరు ఆటగాళ్ల చూపులు కనిపించాయి. మొదట ట్రావిస్ హెడ్ బెంగళూరు బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. మరో ఎండ్ లో అభిషేక్ శర్మ సూపర్ షాట్స్ కొడుతూ తక్కువ స్కోర్ వద్దే ఔట్ అయ్యాడు. కాస్త ఊపిరి పీల్చుకునే లోపే బెంగళూరుపై తుఫాను మొదలైంది క్లాసెన్ రూపంలో.. తొలి బంతి నుంచే తుఫాను ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.
హెన్రిచ్ క్లాసెన్ 31 బంతుల్లో 67 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. క్లాసెన్ కొట్టిన అద్భుతమైన షాట్స్ తో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం షేక్ అయింది. కొడితే బంతి స్టేడియం బయటపడేలా తన ఇన్నింగ్స్ ను కొనసాగించాడు క్లాసెన్. హైదరాబాద్ ఇన్నింగ్స్ 17 ఓవర్ లో క్లాసెన్ భారీ సిక్సర్ బాదాడు. కొడితే స్టేడియం బయటపడింది. లాకీ ఫెర్గూసన్ వేసిన 17వ ఓవర్ రెండో బంతిని క్లాసెన్ భారీ సిక్సర్ కొట్టాడు. అది ఏకంగా స్టేడియం యటపడింది. ఇది 106 మీటర్లు ఉంది. ఇది ఐపీఎల్ హిస్టరీలో మరో భారీ సిక్సర్ గా రికార్డు సృష్టించింది.
ధోని కొట్టిన ఆ హ్యాట్రిక్ సిక్సులే చెన్నైని గెలిపించాయి.. ! ముంబైని ముంచేశావ్ కదా హార్దిక్ !
ట్రావిస్ హెడ్ (102 పరుగులు), హెన్రిచ్ క్లాసెన్ (67 పరుగులు), ఐడెన్ మార్క్రమ్ (32 పరుగులు), అబ్దుల్ సమద్ (37 పరుగులు) ధనాధన్ ఇన్నింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి 287/3 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇది ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక జట్టు స్కోర్ కావడం విశేషం.
కిర్రాక్ బ్యాటింగ్.. సిక్సర్లే సిక్సర్లు.. 39 బంతుల్లోనే ట్రావిస్ హెడ్ రికార్డు సెంచరీ
