టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి నటాషాతో తన ప్రేమను అందరికీ కన్ఫామ్ చేశాడు. కొత్త సంవత్సరం 2020 వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో స్పీడ్‌ బోట్‌లో విహరిస్తూ హార్దిక్ త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్ తొడిగాడు. ఆ తర్వాత కేక్ కట్ చేసి తమ నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎంగేజ్‌మెంట్ ఫోటోలను పోస్టు చేసిన పాండ్యా.. 'నీకు నేను, నాకు నువ్వు, హిందుస్తాన్ మొత్తానికి ఇది తెలియాలి' అని క్యాప్షన్ పెట్టాడు.

తాజాగా... వీరిద్దిరికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో భారత జట్టుకు దూరంగా ఉంటున్న హార్దిక్‌ పాండ్యా తన ప్రియురాలు నటాషా స్టాన్‌కోవిచ్‌తో కలిసి విహరిస్తున్నాడు.

Also Read నెంబర్ 4 స్థానంలో కోహ్లీ... హెడేన్ అసంతృప్తి...

 సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబందించిన విషయాలను షేర్ చేసుకునే నటాషా.. తన ఇన్‌స్టాలో తాజాగా టూర్‌కు సంబందించిన పోటోలను పోస్ట్‌ చేసింది. పాండ్యాతో ఉన్న హాట్ హాట్ చిత్రాన్ని షేర్ చేసింది. నటాషా బికినీలో అదరగొట్టగా.. షర్ట్‌ లేకుండా ఉన్న హార్దిక్ వావ్ అనిపించాడు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🔥❤️ #throwback😍 @hardikpandya93

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on Jan 13, 2020 at 5:48am PST

ఈ పిక్ లో నటాషా బికినీ ధరించగా... అందరి కళ్లు ఆమెపైనే పడ్డాయి. దీంతో... నటాషాను పొగడ్తలతో ముంచెత్తుతూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అందరూ నటాషా బికినీ మీదే కామెంట్స్ చేయడం గమనార్హం.