T20 World Cup 2024 : తమకంటే ఎంతో బలమైన పాకిస్తాన్ ఏ మాత్రం తాము తక్కువ కాదంటూ అదరిపోయే బ్యాటింగ్, బౌలింగ్ తో అమెరికా ఆటగాళ్లు అదరగొట్టారు. పాకిస్తాన్ ను చిత్తుచూసి గ్రూప్ ఏలో టాప్ లోకి వెళ్లారు. తమ ఆటగాళ్ల ప్రదర్శనపై బాబార్ ఆజం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాడు.
T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ 2024లో ఎవరూ ఊహించని విధంగా సూపర్ ఓవర్ లో పాకిస్తాన్ ను చిత్తుచేసింది అమెరికా. దీంతో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తీవ్ర నిరాశకు గురయ్యాడు. తమ జట్టు ప్రత్యర్థులను తక్కువ అంచనా వేసిందనీ, దీంతో ఆటలోని అన్ని అంశాల్లో పేలవమైన ప్రదర్శనతో వెనుకబడిందని పేర్కొన్నాడు. కీలకమైన టోర్నమెంట్ ఆరంభంలో తమ అలసత్వం తమను తీవ్రంగా నష్టపరిచిందని గ్రహించిన పాక్ టీమ్ లో నిరాశ, నిస్పృహలను బాబార్ ఆజం మాటలు ప్రతిబింబించాయి.
అయితే, బాబర్ ఆజం తన ఆటగాళ్లపై బహిరంగంగా విమర్శలు చేయడం తగదనీ, ఇది మంచి నాయకుడి లక్షణం కాదనే విమర్శలు వస్తున్నాయి. భారత మాజీ వికెట్ కీపర్- బ్యాట్స్ మెన్ దినేశ్ కార్తీక్ ఇదే విషయం గురించి ప్రస్తావిస్తూ బాబర్ ఆజం పై విమర్శలు గుప్పించారు. తమ సొంత ఆటగాళ్లపై విమర్శలు దిగే బదులు.. ఒక కెప్టెన్ తన ఆటగాళ్లకు మద్దతు ఇచ్చే మార్గాలను గుర్తించాలని బాబార్ ఆజం కు దినేష్ కార్తీక్ హితవు పాలికాడు.
బీసీసీఐ కాంట్రాక్టు రద్దు.. టీమిండియాలో చోటుదక్కకపోవడంపై శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
"ఒక నాయకుడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ లలో దౌత్యపరంగా వ్యవహరించడానికి, ఏదో విధంగా ఆటగాళ్లకు మద్దతిచ్చే మార్గాన్ని వెతుక్కోవాలి. డ్రెస్సింగ్ రూమ్ లోని నాలుగు గోడల లోపల, మీరు మీకు ఏమి కావాలో చెప్పగలరు. కొంతమందిని ఈ విధంగా చూడవచ్చు, కానీ మీరు మీ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడానికి ఒక మార్గాన్ని కనుగొనాలి. నిజాయతీగా ఉండటం ఒక విషయం, జట్టు డైనమిక్స్ ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మరొకటి'' అని కార్తీక్ క్రిక్ బజ్ తో అన్నాడు.
''అతను కొత్తగా కెప్టెన్ గా నియమితుడయ్యాడు. ప్రస్తుతం చాలా మంది ఆటగాళ్లు పెద్దగా రాణించకుండా పేలవ ఫామ్ లో ఉన్నారు. వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నా'రు. చిరకాల ప్రత్యర్థి భారత్ తో ఆదివారం జరిగే మ్యాచ్ కు ముందు మీడియా సమావేశంలో బాబర్ ఆజం చేసిన వ్యాఖ్యలు నిస్సందేహంగా ఆటగాళ్ల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని దినేస్ కార్తీక్ అన్నాడు. "ఏం జరిగినా తాను బాగానే ఉన్నానని, వారు రాగలరని సూచించడానికి అతను బాడీ లాంగ్వేజ్ కనుగొనడానికి ఒక మార్గాన్ని కనుగొనాలి. అవును, నిరాశను చూపించడం మంచిదే, కానీ ఆటగాళ్లు ఇప్పటికే ఉన్న దానికంటే ఎక్కువ ఆందోళన చెందకుండా చూపించడానికి ఒక మార్గం ఉంటుందని'' దినేస్ కార్తీక్ పేర్కొన్నాడు.
T20 World Cup 2024 : 12 పరుగుల తేడాతో ఐర్లాండ్ ను చిత్తుచేసిన కెనడా.. మరింత రసవత్తరంగా గ్రూప్ ఏ
