Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ కి దూరమైన భజ్జీ.. చాలా కష్టంగా ఉందంటూ..

కొన్ని పర్సనల్ కారణాల కారణంగా ఐపీఎల్ కి దూరమైనట్లు చెప్పిన భజ్జీ.. చాలా కష్టంగా ఉందని.. ఇవిచాలా గడ్డు పరిస్థితులు అంటూ ట్వీట్ చేయడం గమనార్హం.

These Are Difficult Times": Harbhajan Singh After Deciding To Skip IPL 202
Author
Hyderabad, First Published Sep 5, 2020, 8:52 AM IST


చెన్నై సూపర్ కింగ్స్ ఏ ముహూర్తంలో యూఏఈలో అడుగుపెట్టిందో కానీ దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే వైఎస్ కెప్టెన్ , కీలక ఆటగాడు సురేశ్  రైనా వైదొలగడంతో పాటు 13 మంది జట్టు సభ్యులు కోవిడ్ బారినపడటంతో చెన్నై అల్లాడుతోంది. ఇదే సమయంలో ఆ జట్టుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 

వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హార్భజన్ సింగ్ ఐపీఎల్ 13 నుంచి తప్పుకుంటున్నట్లు  ప్రకటించాడు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించాడు. గత కొద్ది రోజులుగా హర్భజన్ సింగ్ తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆమె చెంత ఉండాలని భజ్జీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

 

కాగా.. కొన్ని పర్సనల్ కారణాల కారణంగా ఐపీఎల్ కి దూరమైనట్లు చెప్పిన భజ్జీ.. చాలా కష్టంగా ఉందని.. ఇవిచాలా గడ్డు పరిస్థితులు అంటూ ట్వీట్ చేయడం గమనార్హం.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. ఆగస్టు 20న యూఏఈకి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ చేరుకుంది. అయితే జట్టుతో కలిసి కాకుండా తాను విడిగా సెప్టెంబర్ 1 నాటికి యూఏఈకి వస్తానని హార్భజన్ చెప్పాడు. సుదీర్ఘకాలం ముంబయి ఇండియన్స్ టీమ్‌కి ఆడిన హర్భజన్ సింగ్.. 2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. స్పిన్ విభాగంలో భజ్జీ స్థానాన్ని ఇమ్రాన్ తాహిర్ భర్తీ చేస్తాడని భావిస్తున్నారు. ప్రస్తుతం సీపీఎల్‌లో ఆడుతున్న తాహిర్ ఈ నెల 10 వరకు అక్కడ బిజీగా ఉంటాడు. ఆ తర్వాతే యూఏఈ చేరుకుని చెన్నై సూపర్ కింగ్స్‌ను కలవనున్నాడు

Follow Us:
Download App:
  • android
  • ios