క్రికెట్ బ్రదర్స్ అనగానే.. ఇప్పుడున్నవారిలో ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది పాండ్యా బ్రదర్స్. టీమిండియాలోనూ కలిసి ఆడిన ఈ అన్నదమ్ములు... ఐపీఎల్ లోనూ కలిసి ఆడుతున్నారు. ముంబయి ఇండియన్స్ జట్టు తరపున అదరగొడుతున్నారు.

హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా.. ఇద్దరూ ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హార్దిక్ పాండ్యా.. మోడల్ నటాషాను, కృనాల్.. నటి పంకూరీ శర్మను పెళ్లి చేసుకున్నారు.

వీరు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఈ నేపథ్యంలో.. నలుగురు కలిసి సందడి చేశారు. పాండ్యా బ్రదర్స్.. తమ భార్యలతో కలిసి స్టెప్పులేశారు. 

 

ఆ వీడియోని హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది. కాగా.. వీరు నలుగురు కలిసి దిగిన ఫోటోని నటాషా సోషల్ మీడియాలో షేర్ చేసి.. దానికి పాండ్యా స్వాగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఓ వైపు ఐపీఎల్ వరస విజయాలతో తమ జట్టు తరపున అదరగొడుతూనే.. మధ్యలో ఇలా భార్యలతో ఎంజాయ్ చేస్తున్నారు. వీరి జోడీలను అభిమానుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది.

ఇదిలా ఉండగా.. హార్దిక్ పాండ్యా కి ఇటీవల కుమారుడు కూడా జన్మించాడు. బాబుకి అగస్త్య అనే పేరు కూడా ఖరారు చేశారు. అప్పుడప్పుడు తమ కుమారుడితో కలిసి సందడి చేస్తూ.. వాటిని కూడా అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటారు.