కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ భారత్ లోనూ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ నడుస్తోంది. ఈ కరోనా వైరస్ తో క్రీడా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ జరగాల్సిన అన్ని క్రీడలు ఆగిపోయాయి.

దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే కుటుంబసభ్యులతో గుడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న మొదట్లొ క్రీడాకారులంతా సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ ఒకరిపై మరొకరు విసిరారు. ఆ తర్వాత ఎవరికి వారు సోషల్ మీడియాలో ఒకరిని మరోకరు ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారు

తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈసీబీ( ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు) సోషల్ మీడియా వేదికగా ఓ ప్నశ్న వదిలింది.  దానికి సంబంధించిన వీడియోని కూడా ఈసీబీ తన ట్విట్టర్ లో పోస్టు చేసింది.

కోహ్లీని ఇప్పటి వరకు ఎదురుక్కొన్న అత్యుత్తమ బంతి ఇదే అంటూ ట్విట్టర్ లో ఈసీబీ పేర్కొంది. అది భారత్, ఇంగ్లాండ్ మధ్య 2018లో జరిగిన ఆటకు సంబంధించిన వీడియో అది. అందులో కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా.. ఇంగ్లాండ్ క్రికెటర్ ఆదిల్ రషీద్ బౌలింగ్ చేశాడు. కోహ్లీ బ్యాటింగ్ చేసిన వెంటనే ఔట్ అవ్వగా... అలా ఔట్ అవుతానని కోహ్లీ ఊహించలేకపోయాడు. దీంతో వెంటనే షాకయ్యాడు.

కాగా... ఆ వీడియోని ఇప్పుడు ఈసీబీ షేర్ ఛేసి... అత్యుత్తమ బంతి ఇదే కదా కోహ్లీ అంటూ పేర్కొనడం గమనార్హం. దీనికి కోహ్లీ సమాధానం ఇంకా చెప్పలేదు. కాగా.. దీనికి ఏమని సమాధానం చెబుతాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.