Virat Kohli: భార‌త్-ఇంగ్లాండ్ మ‌ధ్య జ‌రుగుతున్న టెస్టు సిరీస్ కు టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ త‌న వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో దూరం అయ్యాడు. అయితే, రాబోయే ఐపీఎల్ 2024లో ఆడేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ క్ర‌మంలోనే కోహ్లీ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.  

IPL 2024 - Virat Kohli : ఇండియాన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) కొత్త సీజ‌న్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా లీగ్ లో పాల్గొనే అన్ని టీమ్ లు ఇప్ప‌టికే గెలుపు వ్యూహాల‌ను సిద్ధం చేసుకుంటూ ప్రాక్టిస్ షురూ చేశాయి. అయితే, ఐపీఎల్ గురించి టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై తనకున్న అమితమైన అభిమానాన్ని వ్యక్తం చేసిన కింగ్ కోహ్లీ ఈ టీ20 టోర్నమెంట్ విజయానికి ఆటగాళ్లు, అభిమానుల మధ్య ఏర్పడిన బలమైన కనెక్షన్ కారణమని పేర్కొన్నాడు.

ప్రస్తుతం వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ ల‌ సిరీస్ కు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ తో మ‌ళ్లీ గ్రౌండ్ లోకి దిగ‌నున్నాడు. ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే ఐపీఎల్ తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కింగ్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. "నేను ఐపీఎల్ ను చాలా ఇష్ట‌ప‌డుతున్నాను. ఎందుకంటే.. మీరు పంచుకునే స్నేహం, మీరు చాలా మంది కొత్త ఆటగాళ్లతో క‌లిసి ఆడుతారు. మీ స్వంత దేశానికి చెందని, మీరు తరచుగా చూడని చాలా మంది ఆటగాళ్లతో మీరు ఒక‌టి రెండు రోజుల తేడాతో క‌లుసుకుంటూ ఉంటారు" అని కోహ్లీ చెప్పాడు.

IPL 2024 : భువ‌నేశ్వ‌ర్ మోడలింగ్.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త జెర్సీ చూశారా..?

ప్రతి ఒక్కరూ ఐపీఎల్ను అంతగా ఇష్టపడటానికి ఒక కారణం ఉందనీ, ఆటగాళ్లకు, అభిమానులకు మ‌ధ్య ప్రత్యేక అనుబంధం ఉందని కోహ్లీ తెలిపాడు. ఐసీసీ నిర్వహించే టోర్నీలతో పాటు వివిధ క్రికెట్ టోర్నమెంట్లలో వివిధ జట్లకు చెందిన ఆటగాళ్ల మధ్య పరిమిత సంబంధాలను కోహ్లీ నొక్కి చెప్పాడు. 'మీరు అన్ని టోర్నమెంట్లలో ఒక జట్టు వర్సెస్ మరో జట్టు ఆడతారు. ఐసీసీ టోర్నమెంట్లు అప్పుడప్పుడూ వస్తుంటాయని, కానీ ఐసీసీ టోర్నమెంట్లలో కూడా ఇతర ఆటగాళ్లతో ఎక్కువ‌గా మాట్లాడలేర‌నీ, ఇతర జట్టును పెద్ద‌గా చూడ‌ర‌ని చెప్పాడు. కానీ, కానీ ఐపీఎల్ లో ప్రతి రెండు, మూడో రోజు ప్రతి జట్టును కలుస్తార‌నీ, అదే ఐపీఎల్ బ్యూటీ అని పేర్కొన్నాడు. వేరే జట్టుతో వేరే నగరంలో వేర్వేరు పరిస్థితులలో ఆడుతార‌నీ, టోర్నమెంట్ లోని వివిధ దశల్లో ప్రతి ఒక్కరిలో ఒక్కో రకమైన సంకల్పం ఉంటుందనీ, అలాంటి అద్భుత క్షణాలను సృష్టిస్తున్నారని కింగ్ కోహ్లీ చెప్పాడు.

Scroll to load tweet…

India vs England: 15 ఏండ్ల త‌ర్వాత భార‌త్ అరుదైన రికార్డు..