IPL 2024 : భువనేశ్వర్ మోడలింగ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీ చూశారా..?
Sunrisers Hyderabad: తమ కొత్త జెర్సీని ఆవిష్కరించడం, పునరుద్ధరించిన జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ రాబోయే ఐపీఎల్ 2024 సీజన్ లో తమ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాలని చూస్తోంది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2024 టైటిల్ ను గెలుచుకోవాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
Sunrisers Hyderabad new jersey: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఫ్రాంచైజీ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ నుంచి జెర్సీకి సంబంధించిన దృశ్యాలను పంచుకుంది. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కొత్త జేర్సీని మోడలింగ్ చేశాడు. "ఫైర్ కిట్. ఫైర్ ప్లేయర్. ఐపీఎల్ 2024 సిద్ధంగా ఉన్నాం' అని సన్ రైజర్స్ హైదరాబాద్ తన సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది.
కాగా, ఐపీఎల్ 2024 కోసం న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్ డేనియల్ వెటోరిని జట్టు ప్రధాన కోచ్ గా నియమిస్తున్నట్లు కావ్యా మారన్ యాజమాన్యంలోని హైదరాబాద్ ఫ్రాంచైజీ ప్రకటించింది. అలాగే, ఐపీఎల్ 2024 కొత్త సీజన్ కోసం కెప్టెన్సీ మార్పునకు మొగ్గుచూపిన జట్టు యాజమాన్యం ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్ ను కెప్టెన్ గా చేసింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సారథ్యంలో 2016లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ మరోసారి టైటిల్ గెలుపే లక్ష్యంగా జట్టులో మార్పులు చేస్తోంది.
India vs England: 15 ఏండ్ల తర్వాత భారత్ అరుదైన రికార్డు..
న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్ మన్ కేన్ విలియమ్సన్ సారథ్యంలో 2018 ఎడిషన్ లో ఫైనల్స్ కు చేరినప్పటికీ హైదరాబాద్ టీమ్ టైటిల్ ను గెలుచుకోలేకపోయింది. దీంతో ఈ సీజన్ లో వ్యూహాత్మక ఆటగాళ్ల కొనుగోలు, వ్యూహాత్మక ఎత్తుగడలతో ఈ మెగా క్రికెట్ లీగ్ ట్రోఫీని దక్కించుకోవాలని సన్ రైజర్స్ హైదరాబాద్ లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఎల్ 2024 కు ముందు హ్యారీ బ్రూక్, కార్తీక్ త్యాగి, ఆదిల్ రషీద్, అకీల్ హుస్సేన్, సమర్థ్ వ్యాస్ వంటి ఆటగాళ్లను విడుదల చేసింది.
వేలంలో ప్యాట్ కమిన్స్ రూ.20.50 కోట్లు, ట్రావిస్ హెడ్ రూ.6.8 కోట్లు, జయదేవ్ ఉనద్కత్ రూ.1.6 కోట్లు, వానిందు హసరంగ రూ.1.5 కోట్లు, ఆకాశ్ సింగ్, ఝతావేద సుబ్రమణియన్ రూ.20 లక్షలకు కొనుగోలు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. తమ కొత్త జెర్సీని ఆవిష్కరించడం, పునరుద్ధరించిన జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ రాబోయే ఐపీఎల్ 2024 సీజన్ లో తమ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాలని చూస్తోంది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2024 టైటిల్ ను గెలుచుకోవాలని చూస్తోంది.
ఏం మ్యాచ్ గురూ.. థ్రిల్ లో ముంచెత్తారు.. చివరి ఓవర్ లో హ్యాట్రిక్.. 1 పరుగుతో గెలుపు !