ICC Mens U19 World Cup: అండర్ 19 వరల్డ్ కప్ కోసం తలపడే భారత టీం ఇదే.. కెప్టెన్ ఎవరంటే?

అండర్ 19 వరల్డ్ కప్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఇందుకోసం జూనియర్ సెలెక్షన్ కమిటీ అండర్ 19 టీమిండియాను ఎంపిక చేసింది. ఈ జట్టును బీసీసీఐ సెక్రెటరీ జైషా ప్రకటించారు. వరల్డ్ కప్ కంటే ముందు భారత్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ల మధ్య ట్రై సిరీస్‌ దక్షిణాఫ్రికాలో జరగనుంది. ఆ తర్వాత వెంటనే వరల్డ్ కప్ మ్యాచ్‌లు అక్కడే ప్రారంభం కానున్నాయి. 
 

team Under 19 squad for tri series in south africa and ICC mens under 19 world cup announced by jayshah kms

U19 Wordl Cup: అండర్19 వరల్డ్ కప్‌ కోసం భారత టీం ఎంపిక పూర్తయింది. వరల్డ్ కప్ కోసం తలపడే అండర్ 19 ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు. ఈ టీమ్‌కు వరల్డ్ కప్ కంటే ముందు ఓ సిరీస్‌ ఆడనుంది. దక్షిణాఫ్రికాలో జరిగే ట్రైసిరీస్‌లో ఈ టీం ఆడుతుంది. ఆ తర్వాత అండర్ 19 వరల్డ్ కప్ కోసం ప్రిపరేషన్ మరింత పెరుగుతుంది.

జూనియర్ సెలెక్షన్ కమిటీ అండర్ 19 మెన్స్ స్క్వాడ్‌ను ఎంపిక చేసింది. వీరు వరల్డ్ కప్ కంటే ముందు దక్షిణాఫ్రికాలో భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగే ట్రైసిరీస్‌లో ఆడుతారు. ఈ ట్రైసిరీస్ మ్యాచ్‌లు డిసెంబర్ 29వ తేదీన మొదలవుతాయి. ఫైనల్ మ్యాచ్ వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన జరుగుతుంది.

ఈ ట్రై సిరీస్ తర్వాత అండర్ 19 వరల్డ్ కప్ కోసం ఈ టీమ్ ప్రిపరేషన్స్ పెంచుతుంది.

ట్రై సిరీస్, అండర్ 19 వరల్డ్ కప్‌లో తలపడే భారత టీం జాబితా ఇదే..

1. అర్షిన్ కులకర్ణి (మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్), 
2. ఆదర్శ్ సింగ్(ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్), 
3. రుద్ర మయూరి పటేల్ (గుజరాత్ క్రికెట్ అసోసియేషన్), 
4. సచిన్ దాస్ (మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్), 
5. పియాంశు మోలియా (బరోడా క్రికెట్ అసోసియేషన్), 
6. ఉదయ్ సహారన్(కెప్టెన్)(పంజాబ్ క్రికెట్ అసోసియేషన్), 
7. ఆరవెల్లి అవనీశ్ రావు (వికెట్ కీపర్)(హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్), 
8. సౌమి కుమార్ పాండే(వైస్ కెప్టెన్)(మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్), 
9. మురుగన్ అభిషేక్ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్), 
10. ఇన్నేశ్ మహారాజన్(వికెట్ కీపర్) (హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్), 
11. ధనుశ్ గౌడ(కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్), 
12. ఆరాధ్య శుక్లా (పంజాబ్ క్రికెట్ అసోసియేషన్),
13. రాజ్ లింబానీ (బరోడా క్రికెట్ అసోసియేషన్),
14. నిమన్ తివారీ (ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్),
15. ముషీర్ ఖాన్ (ముంబయి క్రికెట్ అసోసియేషన్)

ట్రై సిరీస్ కోసం స్టాండ్ బై ప్లేయర్లు:
1. ప్రేమ్ దేవకర్ (ముంబయి క్రికెట్ అసోసియేషన్),
2. అంశ్ గోసాయి (సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్),
3. మహమ్మద్ అమాన్ (ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్)

Also Read: IPL 2024 Auction: ఐపీఎల్ 2024 సీజన్‌లో 77 ఖాళీల‌కు వేలంలో 333 మంది పోటీ..

బ్యాకప్ ప్లేయర్: దిగ్విజయ్ పాటిల్ (మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్), జయంత్ గోయత్ (హర్యానా క్రికెట్ అసోసియేషన్), పి విగ్నేష్ (తమిళనాడు క్రికెట్ అసోసియేషన్), కిరణ్ చార్మాలే (మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్)

వరల్డ్ కప్‌లో ఇండియా మ్యాచ్‌లు:

అండర్ 19 వరల్డ్ కప్ సిరీస్ దక్షిణాఫ్రికాలో జరుగుతుంది. టీమిండియా గ్రూప్‌ ఏలో ఉంటుంది. టీమిండియాతోపాటు బంగ్లాదేశ్, ఐర్లాండ్, యూఎస్ఏలు ఈ గ్రూపులోనే ఉన్నాయి. ఈ గ్రూపులో మ్యాచ్‌లో జనవరి 20వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. తొలి మ్యాచ్ టీమిండియా, బంగ్లాదేశ్ టీమ్‌కు మధ్య జరుగుతుంది. ఆ తర్వాత ఐర్లాండ్, యూఎస్‌లతో జనవరి 25, 28వ తేదీల్లో మ్యాచ్‌లు ఉంటాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios