ఆగస్ట్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును బుధవారం ప్రకటించింది.  టీమ్ ఇండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగారకర్ నియామకం జరిగిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వెలువడింది. 

ఈ ఏడాది ఆగస్ట్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును బుధవారం ప్రకటించింది. ఐపీఎల్ 2023లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే మరో స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌కు మాత్రం జట్టులో చోటు దక్కలేదు. పొట్టి ఫార్మాట్‌లో హార్దిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహించనుండగా, మిస్టర్ 360 డిగ్రీస్ సూర్య కుమార్ యాదవ్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. టీమ్ ఇండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగారకర్ నియామకం జరిగిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వెలువడింది. 

భారత జట్టు :

హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ), సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్ ), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

వెస్టిండీస్‌తో టీమిండియా టీ 20 సిరీస్ షెడ్యూల్ :

03.08.23 : ఫస్ట్ టీ20, ట్రినిడాడ్
06.08.23 : సెకండ్ టీ 20, గుయానా
08.08.23 : థర్డ్ టీ 20, గుయానా 
12.08.23 : ఫోర్త్ టీ 20, లౌడేర్ హిల్, ఫ్లోరిడా
13.08.23 : ఫిఫ్త్ టీ 20, లౌడేర్ హిల్, ఫ్లోరిడా

మరోవైపు.. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే కరేబియన్ గడ్డకు చేరుకున్న భారత ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను ఆరంభించారు. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు బుధవారం విండీస్ దిగ్గజ ప్లేయర్ గ్యారీ సోబర్స్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, అశ్విన్, శార్థూల్ ఠాకూర్ తదితరులతో సోబర్స్‌తో మాట్లాడారు.