Asianet News TeluguAsianet News Telugu

మ్యాచ్ ఫిజు విరాళం...గ్రౌండ్ సిబ్బందికే ఎందుకంటే...: సంజు శాంసన్

భారత యువ క్రికెటర్ సంజూ శాంసన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు.  సొంత రాష్ట్రానికి చెందిన ఓ క్రికెట్ మైదానంలో పనిచేసే సిబ్బందికి తన మ్యాచ్ పీజును విరాళంగా ప్రకటించాడు.  

team india young player sanju samson donates match fees to groundmen
Author
Thiruvananthapuram, First Published Sep 8, 2019, 8:02 PM IST

టీమిండియా యువ క్రికెటర్ సంజూ శాంసన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. తన మ్యాచ్ పీజును తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్  స్టేడియం గ్రౌండ్ ఫీల్డ్ సిబ్బందికి విరాళంగా ప్రకటించాడు. అయితే తానేమీ గ్రౌండ్ సిబ్బందిపై జాలితో ఈ పని చేయలేదని...వారి పనితనానికి ముగ్ధున్నయి విరాళాన్ని ప్రకటించినట్లు శాంసన్ తెలిపాడు. 

దక్షణాఫ్రికా-ఎ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో వున్న విషయం తెలిసిందే. వన్డే సీరిస్ లో భాగంగా ఆ జట్టు భారత్-ఎ తో తలపడుతూ తిరువనంతరపురంలో చివరి వన్డే  ఆడింది. ఈ మ్యాచ్ లో స్థానిక ఆటగాడు సంజు  శాంసన్ చెలరేగి విద్వంసం సృష్టించాడు. కేవలం 48 బంతుల్లోనే 91 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ తో భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించిపెట్టాడు. 

అయితే కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు ఈ మ్యాచ్ కు కూడా అంతరాయం కలిగించాయి. భారీ వర్షానికి  మైదానం తడిసిపోయి వుంటే ఈ మ్యాచ్ రద్దయ్యేది. కానీ మైదాన సిబ్బంది అలా జరక్కుండా ఎప్పటికప్పుడు వర్షపు నీటిని తొలగిస్తూ చాలా జాగ్రత్తపడ్డారు. దీంతో మ్యాచ్ సాధ్యపడి శాంసన్ భారీ పరుగులు  సాధించగలిగాడు. 

ఒకవేళ సిబ్బంది మైదానాన్ని  సిద్దం చేసుండకపోతే మ్యాచ్ జరిగేది కాదు...తాను ఈ భారీ ఇన్నింగ్స్ చేసేవాడిని కాదన్నది శాంసన్ వాదన. వారు వర్షపు నీరు మైదానంలో నిలవకుండా ఎంత కష్టపడ్డారో తాను కళ్లారా చూశానని తెలిపాడు. అందువల్లే మ్యాచ్ పీజును వారికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు శాంసన్ వివరించాడు. 


వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 20 ఓవర్లకు కుదించారు. భారత్-ఎ మొదట బ్యాటింగ్ కు దిగి  204 పరుగులు చేసింది. 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా-ఎ కేవలం 168 పరుగులకే  కుప్పకూలింది. దీంతో భారత జట్టు 36 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios