సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఆరంగ్రేటం...శిఖర్ ధావన్, అక్షర్ పటేల్ స్థానంలో ఇద్దరు కొత్త కుర్రాళ్లకు అవకాశం...టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ...

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు, ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. టీమిండియా తరుపున సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఆరంగ్రేటం చేస్తున్నారు. శిఖర్ ధావన్, అక్షర్ పటేల్ స్థానంలో ఈ ఇద్దరూ ఆడబోతున్నారు.

తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కెఎల్ రాహుల్‌తో పాటు ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయబోతున్నాడు. 

భారత జట్టు:
కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, చాహాల్

ఇంగ్లాండ్ జట్టు: 
జాసన్ రాయ్, బట్లర్, డేవిడ్ మలాన్, బెయిర్ స్టో, ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్, జోఫ్రా ఆర్చర్, టామ్ కుర్రాన్, క్రిస్ జోర్డాన్, అదిల్ రషీద్