Sanju Samson:టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుతో ఉన్నాడు. అతడు తొలి టీ20 ఆడకపోయినా డబ్లిన్ లో మనోడికి భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

జాతీయ జట్టు తరఫున అడపాదడపా వచ్చి పోతున్న సంజూ శాంసన్ కు భారత్ లో ఫాలోయింగ్ ఎంతుందో గానీ ఐర్లాండ్ లో మాత్రం ఫుల్ పాపులర్ అయ్యాడు. అతడు కనబడితే చాలు ఐర్లాండ్ లో ఉంటున్న ఇండియా ఫ్యాన్స్ ‘సంజూ భయ్యా ఒక సెల్ఫీ ప్లీజ్..’ అంటూ గుమిగూడుతున్నారు. ఇక ముఖ్యంగా దక్షిణాది అభిమానులైతే ‘సంజూ చేట.. సంజూ చేట (బ్రదర్).. ఆటోగ్రాఫ్’ అంటూ మీద పడిపోతున్నారు. తొలి టీ20 లో అతడు ఆడకపోయినా మనోడికి మంగళవారం జరుగబోయే రెండో టీ20లో ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రెండో టీ20కి ముందు ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా గ్రౌండ్ లో ఉన్న భారత ఆటగాళ్లను చూడటానికి ఇక్కడి ఇండియన్ ఫ్యాన్స్ పెద్దఎత్తున వచ్చారు. వీరిలో చాలా మంది సంజూ శాంసన్ తో ఫోటోలు దిగడానికి, ఆటోగ్రాఫ్ లకోసం ఎగబడ్డారు. మళయాళీ అభిమానుల హంగామా అంతా ఇంతా కాదు. 

Scroll to load tweet…

‘సంజూ చేటా వీ లవ్ యూ..’ అని మళయాళీ అభిమానులు గోల చేయగా.. అక్కడికి వచ్చిన పలువురు తెలుగు అభిమానులు..‘అన్నా ఇక్కడిక్కడిక్కడ..’ అని అరిచారు. ఇక తమిళ అభిమానులు.. (సంజూ ఇంగె (ఇక్కడ) పార్ (చూడు)’ అంటూ అరుపులతో హోరెత్తించారు. పక్కనే రాహుల్ త్రిపాఠితో పాటు ఇతర క్రికెటర్లున్నా వాళ్లను పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

కాగా అభిమానుల కోరిక మేరకు సంజూ వాళ్లందరితో ఫోటోలు దిగడం.. ఆటోగ్రాఫ్ లు ఇవ్వడం చేశాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలి మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ కాస్త అస్వస్థతకు గురికావడంతో రెండో మ్యాచ్ లో శాంసన్ కు ఆడే ఛాన్స్ దక్కనుంది. టీ20 ప్రపంచకప్ కు సన్నాహకంగా జరుగుతున్న ఈ మ్యాచ్ లలో మెరిసి జట్టులో స్థానం దక్కించుకోవాలని టీమిండియాకు ఆడుతున్న ప్రతి ఆటగాడు భావిస్తున్నాడు. శాంసన్ కూడా అదే లైన్ లో ఉన్నా నిలకడలేమి అతడిని వేధిస్తున్నది.

Scroll to load tweet…