ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన యువరాజ్ సింగ్ మళ్లీ బ్యాట్ పట్టాడు. కెనడా వేదికన జరుగుతున్న గ్లోబల్ టీ20 లీగ్ లో టొరంటో నేషన్స్ టీం సారథిగా వ్యవహరిస్తున్న యువీ శనివారం ఎడ్మాంటన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెలరేగిపోయాడు. ఈ  మ్యాచ్ భారీ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిన యువీ తన బ్యాటింగ్ సత్తా ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువుచేశాడు. యువీ విద్వంసానికి మరో భారత ఆటగాడు మన్‌ప్రీత్ గోనీ మెరుపులు తోడవడంతో  టోరంటో జట్టు ఘన విజయాన్ని అందుకుంది. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన ఎడ్మంటన్ రాయల్ నిర్ణీత ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు సాధించింది.  బెన్ కటింగ్ 43, షదాబ్ ఖాన్ 36, కెప్టెన్ డుప్లెసిస్ 28 పరుగులలో రాణించారు. ఇలా 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టొరంటో టీమ్ మరో రెండు ఓవర్లు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. కెప్టెన్ యువరాజ్( 35 పరుగులు 21 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లు), క్లాసెస్ (45 పరుగులు) జట్టును ఆదుకున్నారు. ఇక చివర్లో ఉత్కంఠభరితంగా మారిన మ్యాచ్ ను గోనీ వన్ సైడెడ్ గా మార్చాడు. అతడు చివర్లో ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం  12 బంతుల్లోనే 33 పరుగులు చేసి టోరంటోను విజయతీరాలకు చేర్చాడు. 

ఇలా 192 పరుగుల లక్ష్యాన్ని టోరంటో టీం 17.5 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఈ టోర్నీలో భాగంగా గత గురువారం వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్ సారథ్యంలోని వాంకోవర్ నైట్స్ జట్టుతో తలపడ్డ టొరంటో నేషన్స్ ఓటమిపాలైన విషయం తెలసిందే. ఆ మ్యాచ్ లో కెప్టెన్ యువరాజ్ 27 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టి అభిమానులను నిరాశపర్చాడు. కానీ ఈ మ్యాచ్ లో అతడు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో టోరంటో జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

మరిన్ని వార్తలు

కెప్టెన్ గానే కాదు బ్యాట్స్ మెన్ గా యువరాజ్ విఫలం... క్రిస్ గేల్ దే పైచేయి