క్రైస్ట్ చర్చ్: చివరకు మూడు ఫార్మాట్లకు సంబంధించిన భారత క్రికెటర్ల న్యూజిలాండ్ పర్యటన ముగిసింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు సోమవారం న్యూజిలాండ్ పై రెండో టెస్టు మ్యాచును 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో టెస్టు సిరీస్ ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది. 

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసి) ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ లో భారత్ తొలి ఓటమిని చవిచూసింది. తొలి టెస్టు మ్యాచును భారత్ న్యూజిలాండ్ పై పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. 

టెస్టు సిరీస్ కు ముందు జరిగిన ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ను న్యూజిలాండ్ పై భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత జరిగిన మూడు వన్డేల సిరీస్ ను న్యూజిలాండ్ పై 0-3 స్కోరుతో కోల్పోయింది.  టీ20 సిరీస్ తర్వాత పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ వన్డే, టెస్టు సిరీస్ లను ఘోరంగా కోల్పోయింది. 

భారత టాప్ స్కోరర్స్ జాబితా ఇదే...

1 కెఎల్ రాహుల్

న్యూజిలాండ్ పర్యటనలో కేఎల్ రాహుల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీ20, వన్డేలు ఆడిన రాహుల్ మొత్తం 428 పరగులు చేశాడు. టీ20ల్లో 224 పరుగులు, వన్డేల్లో 204 పరుగులు చేశాడు. రాహుల్ టెస్టు మ్యాచులు ఆడదలేదు.

2. శ్రేయస్ అయ్యర్

న్యూజిలాండ్ పర్యటనలో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్ మెన్ ల్లో శ్రేయస్ అయ్యర్ రెండో స్థానంలో నిలిచాడు. టీ20ల్లో అతను 153 పరుగులు చేయగా, వన్డేల్లో 217 పరుగులు చేశాడు. అతను టెస్టు సిరీస్ లో లేడు.

2. రోహిత్ శర్మ

న్యూజిలాండ్ పర్యటనలో టీ20ల్లో రోహిత్ శర్మ 140 పరుగులు చేశాడు. మూడో మ్యాచులో 65 పరుగులు, ఐదో మ్యాచులో 60 పరుగులు చేశాడు. గాయం కారణంగా రోహిత్ శర్మ జట్టుకు దూరమయ్యాడు. దీంతో వన్డేల్లోనూ టెస్టుల్లోనూ ఆడలేదు. 

టాప్ వికెట్ టేకర్స్....

శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా న్యూజిలాండ్ పర్యటనలో అత్యధిక వికెట్లు తీసుకున్నారు. ఈ ఇద్దరు 12 వికెట్ల చొప్పున తీశారు. శార్దూల్ ఠాకూర్ టీ20ల్లో 8 వికెట్లు, వన్డేల్లో నాలుగు వికెట్లు తీశాడు. బుమ్రా టీ20, వన్డేల్లో ఆరు వికెట్లు, టెస్టుల్లో ఆరు వికెట్లు తీసుకున్నాడు. 

యుజ్వేంద్ర చాహల్ 9 వికెట్లు తీసి రెండో స్థానంలో నిలిచాడు. ఐదు టీ20 మ్యాచుల్లో అతను మూడు వికెట్లు తీశాడు. వన్డేల్లో ఆరు వికెట్లు తీశాడు. టెస్టు మ్యాచుల్లో అతను ఆడలేదు.