ఐపీఎల్ 2020లో పాల్గొనడానికి యూఏఈలో పర్యటిస్తున్న టీమిండియా స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ తనకు కాబోయే భార్య ధనశ్రీ వర్మతో కలిసి వున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్ ఈ నెల మొదట్లో ఆమెతో నిశ్చితార్థం జరిగినట్లుగా వెల్లడించాడు. కుటుంబసభ్యులతో విడిపోవడం అనేది ఏ ప్రొఫెషనల్ అథ్లెట్‌కైనా కష్టమేనని చాహల్ అన్నాడు.

అదే సమయంలో ‘‘ నువ్వు నా గుండె పిజ్జాను దొంగిలించావు’’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీనికి ధనశ్రీ వర్మ కూడా ఆసక్తికరంగా రిప్లయ్ ఇచ్చింది ‘‘ తాను ఆ విషయాన్ని అంగీకరిస్తున్నానని పిజ్జా, హార్ట్ ఎమోజీలను దానికి జోడించారు.

కాగా ఐపీఎల్ 2020 ప్రారంభమవ్వడానికి కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఆరు ఫ్రాంచైజీలు యూఏఈకి చేరుకున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది.

ఈ క్రమంలో యూఏఈకి విమానంలో బయల్దేరిన జట్టు ఫోటోను ఆర్‌సీబీ షేర్ చేసింది. దుబాయ్‌ చేరుకున్నట్లు విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్లు ఏబీ డివిలియర్స్, డేల్ స్టెయిన్‌, క్రిస్ మోరిస్‌లు శనివారం సాయంత్రానికి జట్టుతో చేరతారని ఆర్‌సీబీ వెల్లడిచింది.

కాగా బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆటగాళ్లందరూ ఏడు రోజులు పాటు క్వారంటైన్‌లో ఉంటారు. ఆ తర్వాత వారు తమ ప్రాక్టీస్‌ను ప్రారంభించడానికి ముందు కోవిడ్ పరీక్షల్లో మూడు సార్లు నెగిటివ్ రావాలి. కాగా, ఆర్‌సీబీ బౌలింగ్ దళంలో చాహల్ చాలా సంవత్సరాలుగా కీలక సభ్యుడిగా ఉన్నాడు.

బెంగళూరులోని కఠినమైన చిన్నస్వామి స్టేడియంలో మంచి ప్రదర్శన ఇవ్వడం ద్వారా తన సత్తా నిరూపించుకున్నాడు. మరోవైపు గత 12 సీజన్‌లలో రెండుసార్లు ఫైనల్‌కు చేరుకున్న ఆర్‌సీబీ ఎప్పుడూ టైటిల్ గెలవలేదు. అయితే వేదిక, పరిస్థితుల మార్పుతో కోహ్లీ అండ్ కో.. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

"You've stolen a pizza of my heart." ❤️

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on Aug 22, 2020 at 12:14am PDT