‘భారత అప్రతిహత విజయ యాత్ర కొనసాగుతుంది, వేదిక ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా వె డోంట్ కేర్ అన్న రీతిలో కోహ్లీ సేన ఫార్మాట్ తోని సంబంధం లేకుండా దూసుకుపోతుంది. ప్రస్తుత రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ ను ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారత్ మట్టికరిపించి మరో అద్వితీయ విజయాన్ని సాధించింది.
భారత అప్రతిహత విజయ యాత్ర కొనసాగుతుంది, వేదిక ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా వె డోంట్ కేర్ అన్న రీతిలో కోహ్లీ సేన ఫార్మాట్ తోని సంబంధం లేకుండా దూసుకుపోతుంది. ప్రస్తుత రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ ను ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారత్ మట్టికరిపించి మరో అద్వితీయ విజయాన్ని సాధించింది.
ఈ భారీ విజయంతో సారథిగా కోహ్లి అనేక రికార్డులను కొల్లగొట్టాడు. అత్యధిక ఇన్నింగ్స్ విజయాలను సాధించిన తొలి భారత సారథిగా ధోని రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. గతంలో ధోని కెప్టెన్సీలోని టీమిండియా 9 మ్యాచుల్లో ఇన్నింగ్స్ తేడాతో విజయాలను సాధించింది. ప్రస్తుతం కోహ్లి కెప్టెన్సీ లో ఇప్పటివరకు పది టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాలను నమోదు చేసి రికార్డు సృష్టించింది.
Also read: ఇండోర్ టెస్ట్: భారత్ ఘన విజయం..శని వారం కాదు 'షామి' వారం
ఈ జాబితాలో అజారుద్దీన్(8), సౌరవ్ గంగూలీ(7) తరవాతి స్థానాల్లో ఉన్నారు. ఇక సారథిగా అత్యధిక విజయాలను సాధించడంలోనూ కోహ్లీ రికార్డు బుక్కుల్లోకెక్కాడు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ అలెన్ బోర్డర్ సరసన కోహ్లి చేరాడు. కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటివరకు 32 టెస్టు విజయాలను నమోదు చేసింది. అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న 4వ కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ 53 విజయాలతో మొదటి స్థానంలో ఉండగా, ఆసీసీ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 48 విజయాలతో రెండో స్థానంలో, మరో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ వా 41 విజయాలతో మూడవ స్థానంలో ఉన్నారు.
ఇలా అప్రతిహతంగా వరుసగా ఆరు టెస్టుల్లో విజయాలు సాధించడం టీమిండియాకు ఇది రెండో సారి. గతంలో 2013లో ధోని సారథ్యలో, ఆస్ట్రేలియాపై 4సార్లు, విండీస్‌పై 2సార్లు వరుసగా గెలుపొందారు. తాజాగా కోహ్లి సారథ్యంలో విండీస్‌పై 2, దక్షిణాఫ్రికాపై 3, ప్రస్తుతం బంగ్లాపై విక్టరీతో టీమిండియా వరుస టెస్టు విజయాల సంఖ్యను ఆరుకు పెంచుకుంది.
ఈ మ్యాచ్ విజయంతో భారత్ మరో రికార్డును సొంతం చేసుకుంది. ఒకే సీజన్లో ఇలా మూడు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాలను నమోదు చేయడం భారత్ కు ఇది మూడో సారి. గతంలో 1992-93, 93-94 మధ్య కాలంలో వరుసగా మూడు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాలను టీమిండియా నమోదు చేసింది.
Also read: బంగ్లా క్రికెటర్ రికార్డు: సచిన్, ద్రవిడ్ ల తరువాత ముష్ఫికరే!
ప్రస్తుతం భారత్ ఊపు చూస్తుంటేనైతే ఎక్కడా తగ్గే విధంగా కనపడడం లేదు. భారత్ టీం లోని ప్లేయర్స్ అంతా పూర్తి శక్తి సామర్థ్యాలతో ఒకరిని మించి మరొకరు ఆడుతున్నారు. టీం లో ఉండేదేమో కేవలం 11 మంది ఆటగాళ్లు మాత్రమే. ఇలానే గనుక ప్లేయర్స్ ఆడితే రోహిత్ శర్మ అన్నట్టు విరాట్ కోహ్లీకి తలనొప్పులు తప్పేలా కనబడడం లేదు.
