Asianet News TeluguAsianet News Telugu

ఇండోర్ టెస్ట్: భారత్ ఘన విజయం..శని వారం కాదు 'షామి' వారం

బాంగ్లాదేశ్ తోని జరుగుతున్న టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 130 పరుగులతేడాతో బాంగ్లాదేశ్ ను చిత్తు చిత్తుగా ఓడించింది.

Indore test: India records a massive win against Bangladesh, takes 1-0 lead
Author
Indore, First Published Nov 16, 2019, 3:49 PM IST

ఇండోర్: బాంగ్లాదేశ్ తోని జరుగుతున్న టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 130 పరుగులతేడాతో బాంగ్లాదేశ్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో విధించిన 493 పరుగుల టార్గెట్ ను చేరుకోలేక తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే కుప్పకూలింది. ఆ తరువాత ఫాలో ఆన్ లో కూడా ఆ టీం కు కష్టాలు తప్పలేదు. కేవలం 213 పరుగులకే అల్ అవుట్ అయిపోయింది.   

బంగ్లా ఇన్నింగ్స్ పై షమీ నిప్పులు చెరిగాడు. రెండు ఇన్నింగ్సుల్లోనూ కలిపి 7 వికెట్లు తీసాడు.ఈ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసాడు. ఈ రోజు శని వారమా, లేక షామి వారమా అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్ల తెగ హల్చల్ చేస్తున్నారు. 

Also read: బంగ్లా క్రికెటర్ రికార్డు: సచిన్, ద్రవిడ్ ల తరువాత ముష్ఫికరే!

ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ విశ్వరూపం  చూపించాడు. తన బ్యాట్ ఝులిపించాడు. ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి  టెస్టు తొలి ఇన్నింగ్స్ లో డబల్ సెంచరీ బాదాడు. మొత్తం 28 ఫోర్లు, 8 సిక్సులతో 243 పరుగులు చేసి చెలరేగిపోయాడు.

ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో సైతం విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడిన తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 12 ఇన్నింగ్స్‌ల్లోనే మయాంక్ రెండు డబుల్ సెంచరీలు సాధించి అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మయాంక్ ప్రదర్శనపై కెప్టెన్ కోహ్లీ సంతోషంగా ఉన్నాడు.

Also read: విరాట్ కోరిక తీర్చని మయాంక్.. డబల్ కాదు, త్రిబుల్ వీడియో వైరల్

మయాంక్ అగర్వాల్ భారీ సిక్సర్‌తో డబుల్ సెంచరీ పూర్తి చేసుకుని అనంతరం ఆకాశం వైపు చూస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు బ్యాట్‌ చూపిస్తూ అభివందనం చేశాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌ వైపు చూస్తూ డబుల్ సెంచరీ చేశానని చేతివేళ్లతో కెప్టెన్‌ కోహ్లీకి సైగలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ అరుదైన రికార్డును నెలకొల్పాడు. టెస్టు ఫార్మాట్‌లో భారత్‌పై అత్యధిక పరుగులు సాధించిన బంగ్లా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. భారత్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో భాగంగా ముష్పికర్‌ రహీమ్ ఈ ఫీట్‌ను సాధించాడు. 

పరుగులు చేయలేక బంగ్లా టీం పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఐదవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ముష్పికర్‌ వికెట్ ను కాపాడుకుంటూ ఆచితూచి ఆడాడు. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను సాధ్యమైనంతవరకూ కాపాడడానికి ప్రయత్నించాడు. కాకపోతే అతనికి సహచరుల నుంచి తోడ్పాటు లభించలేదు. అవతలివైపు టప టపా వికెట్లు పడుతున్నా, తాను మాత్రం ఏ మాత్రం నిగ్రహం కోల్పోకుండా ఆడుతూ అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 

ప్రస్తుతం జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు ముష్పికర్‌ బాటింగ్ కు వచ్చాడు.  గత ఇన్నింగ్స్ లో కూడా టాప్ స్కోరర్ గా నిలిచిన   ముష్పికర్‌ ఈ ఇన్నింగ్స్ లోను టాప్ స్కోరర్ గా నిలిచి, భారత బౌలర్లకు పరీక్షా పెట్టాడు. 64 పరుగులవద్ద షమీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.   

Follow Us:
Download App:
  • android
  • ios