న్యూడిల్లీ: ఇండియన్ క్రికెటర్ యజువేందర్ చాహల్ గతేడాది చివర్లో కోరియోగ్రాపర్, యూట్యూబర్ ధనశ్రీ వర్మను పెళ్లాడిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో పెళ్లి కావడంతో వీరి వివాహం కేవలం కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్యనే జరిగింది. కాబట్టి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రాలేవు. దీంతో చాహల్ అభిమానులకు నిరాశ తప్పలేదు. 

అయితే తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాతో ప్రత్యక్షమయ్యింది.  ప్రముఖ సెలబ్రిటీ విరల్ భయానీ ఇన్స్టాగ్రామ్ లో ఈ పెళ్లి వేడుకకు సంబంధిచిన వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియోను వీక్షించేందుకు అభిమానులు ఆసక్తి చూపుతుండటంతో వైరల్ గా మారింది.