గేల్, రోహిత్... ఈ రెండు పేర్లు వింటే టక్కున  గుర్తొచ్చేది హార్డ్ హిట్టింగ్. వెస్టిండిస్ జట్టులో అందరూ భారీ హిట్టర్లే అయినా క్రిస్ గేల్ విధ్వంసం ముందు ఎవరూ సరిపోరు. ఇక భారత జట్టులో గేల్ స్థాయిలో హిట్టింగ్ చేయగల ఆటగాడు ఎవరైనా వున్నాడంటే అతడు రోహిత్ మాత్రమే. ఇలా వీరిద్దరిలో ఈ దూకుడు స్వభావం కామన్ పాయింట్. అయితే ఇదొక్కటే వారి మధ్య పోలిక కాదట. మరో పోలిక కూడా తామిద్దరి మధ్య వుందంటూ స్వయంగా రోహిత్ శర్మే స్వయంగా వెల్లడించాడు. 

రోహిత్ శర్మ, క్రిస్ గేల్ ఇద్దరూ ఒకే నంబర్ జెర్సీని వాడతారు. ఇలా 45వ నెంబర్ జెర్సీలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోను రోహిత్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. ముఖ్యంగా 45వ నంబర్ కనిపించేలా కేవలం వెనుకవైపు నుండే దిగారు. ఇదే తామిద్దరి  మధ్య వున్న మరో పోలిక అంటూ రోహిత్ పోస్ట్ చేసిన ఈ ఫోటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 

ఈ సీరిస్ తర్వాత క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించాడు. కాబట్టి చివరిసారిగా గేల్ ఈ జెర్సీలో  కనిపించనున్నాడు. కాబట్టి అతడి గౌరవార్థం రోహిత్ ఈ ఫోటోను షేర్ చేశాడు. ఇద్దరు హిట్టర్లు కలిసి దిగిన ఈ ఫోటో ఇరు దేశాల అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా మాద్యమాల్లో ఈ ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🔥

A post shared by Rohit Sharma (@rohitsharma45) on Aug 7, 2019 at 11:57am PDT