Asianet News TeluguAsianet News Telugu

ధావన్ తమ్ముడు కాదు... అతని అభిమాని: అచ్చం ధావన్‌లా మేకోవర్

ఈ భూమ్మీద మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే సినీ తారలకు, క్రికెటర్లను దేవుళ్లలాగా పూజిస్తారు అభిమానులు. వారిపై అభిమానంతో స్టార్ల వేషభాషలను అనుకరిస్తారు.

Team india Opener shikhar dhawan fan and look alike ram bahadur
Author
New Delhi, First Published May 5, 2020, 6:30 PM IST

ఈ భూమ్మీద మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే సినీ తారలకు, క్రికెటర్లను దేవుళ్లలాగా పూజిస్తారు అభిమానులు. వారిపై అభిమానంతో స్టార్ల వేషభాషలను అనుకరిస్తారు. ఇలాంటి వారికి జనంలోనూ మంచి ఫాలోయింగ్ ఉంటుంది.

ఈ క్రమంలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పోలికలతో ఉన్న రామ్ బహదూర్ కూడా ఈ కోవకు చెందిన వాడే. ధావన్ ఫ్యాన్స్‌తో పాటు గబ్బర్ అభిమానాన్ని కూడా అతను పొందాడు.

తనకు ఎంతో ఇష్టమైన ధావన్ ప్రత్యేక సందర్భాల్లో విష్ చేస్తాడంటూ మురిసిపోతున్నాడని కొడుకుకు జొరావర్ (ధావన్ కొడుకు పేరు) అని పేరు పెట్టుకున్నాడు రామ్ బహదూర్. తొలిసారి ధావన్‌ను కలిసిన నాటి సంగతులను టైమ్స్ ఆఫ్ ఇండియాతో పంచుకున్నాడు.

Also Read:టీమిండియా బౌలింగ్ కోచ్‌గా ఇంట్రెస్టే.. ఆ టీమ్‌ అంటే ఇంకా ఇష్టం: అక్తర్

యూపీకి చెందిన రామ్ బలియాలో జన్మించాడు. లక్నోలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అతను ఓ రోజు సెలూన్ షాప్‌కు వెళ్లాడు. అయితే అక్కడి బార్బర్ కటింగ్ చేసిన అనంతరం.. మీ రు  అచ్చం క్రికెటర్ శిఖర్ ధావన్‌లా కనిపిస్తున్నావు అన్నాడు.

అలాగే మీసకట్టు కూడా ఆయనలా మార్చేస్తే చాలా బాగుంటుందంటూ శిఖర్ ధావన్ ఫోటోను  రామ్ బహదూర్ ముందు ఉంచాడు. ఈ విషయం గురించి అతను మాట్లాడుతూ... బార్బర్ చెప్పిన మాటలు తనపై ప్రభావం చూపాయన్నాడు.

ఇంటికి వచ్చాక అద్దంలో చూసుకున్నా.. నిజమే అనిపించింది. ఆ వెంటనే శిఖర్ పోస్టర్ తీసుకువచ్చి గోడపై అంటించుకున్నాను.. నాకు నేను కొత్తగా కనిపించాను. అప్పటి నుంచి తనకు శిఖర్ ధావన్ పిచ్చి పట్టిందన్నాడు.

నాటి నుంచి శిఖర్‌లా బట్టలు వేయడం, గడ్డం, మీసకట్టు మార్చుకున్నానని  చెప్పాడు. 2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మ్యాచ్ సందర్భంగా తనను కలిసే అవకాశం వచ్చిందని బహదూర్ గుర్తుచేసుకున్నాడు.

ఓ రోజున రాయ్‌పూర్ స్టేడియం బటయ నిల్చోని వున్నా.. అప్పుడే టీమిండియా క్రికెటర్ల బస్సు వచ్చింది. చేతులు కట్టుకుని వున్న తనను శిఖర్ గుర్తుపట్టి, హగ్ చేసుకున్నాడని బహదూర్ వెల్లడించాడు. ఆ సమయంలో తాను భావోద్వేగానికి లోనయ్యానని.. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని తెలిపాడు.

Also Read:కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్లు వీరమరణం: అమరులకు కోహ్లీ నివాళి

అప్పటి నుంచి తమ ఇద్దరి మధ్య బంధం మొదలైందని.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఛాట్ చేసుకుంటామని బహదూర్ వెల్లడించాడు. అలాగే 2017లో న్యూజిలాండ్- ఇండియా మ్యాచ్ కోసం కాన్పూర్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో శిఖర్‌ను చూసి అరిచాను.

అప్పుడు ఆయన వచ్చి నన్ను పలకరించాడు. టికెట్ దొరికిందా అని అడిగాడు.. లేదన్నాను. వెంటనే హోటల్‌కు తీసుకెళ్లి టిక్కెట్టు చేతిలో పెట్టాడని బహదూర్ గుర్తుచేసుకున్నాడు. ఇప్పటి వరకు తాను శిఖర్ ధావన్ ఆడిన ఏ మ్యాచ్ ఒక్కటి కూడా మిస్సవ్వలేదు.

ఇక్కడ మరో విశేషం ఏంటంటే శిఖర్‌లా కనిపించడం వల్ల కొంతమంది నాకు అభిమానులుగా మారిపోయారని బహదూర్ అన్నాడు. నాతో ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటారని.. సెల్ఫీలు తీసుకుంటారని అతను మురిసిపోయాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios