టీమిండియా ప్రాక్టీస్ కోసం ఆరెంజ్ జెర్సీలు... స్విగ్గీ డెలివరీ బాయ్స్‌లా ఉన్నారంటూ...

ఆరెంజ్ కలర్ టీ షర్ట్, ఆరెంజ్ కలర్ క్యాప్, బ్లాక్ కలర్ షార్ట్‌తో టీమిండియా ప్రాక్టీస్ జెర్సీ... చూడడానికి స్విగ్గీ డెలవరీ బాయ్స్ యూనిఫామ్‌లా ఉందంటూ.. 

Team India new orange jersey for Practice sessions, Swiggy responds as boys ready to deliver CRA

ప్రతీ ఐసీసీ టోర్నీలాగే ఈసారి కూడా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో కొత్త జెర్సీలో కనిపించబోతోంది భారత జట్టు. అయితే ఈసారి కిట్ స్పాన్సర్ కూడా మారడంతో సరికొత్త లుక్‌లో దర్శనమివ్వబోతోంది రోహిత్ సేన..

ఇంతకుముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో కాస్త లేత ముదురు నీలి రంగులో ఉన్న జెర్సీలను వాడేది భారత జట్టు. అయితే ఇప్పుడు ఆరెంజ్ కలర్ జెర్సీలను వాడుతోంది. ఆరెంజ్ కలర్ టీ షర్ట్, ఆరెంజ్ కలర్ క్యాప్, బ్లాక్ కలర్ షార్ట్‌తో టీమిండియా ప్రాక్టీస్ జెర్సీ... చూడడానికి స్విగ్గీ డెలవరీ బాయ్స్ యూనిఫామ్‌లా ఉంది...

దీనిపై స్విగ్గీ ఇండియా కూడా ట్విట్టర్‌లో స్పందించింది. ‘చూస్తుంటే ఆరెంజ్ జెర్సీ బాయ్స్, డెలివరీ చేయడానికి రెఢీగా ఉన్నట్టుగా ఉంది.. (వరల్డ్ కప్) అంటూ ట్వీట్ చేసింది స్విగ్గీ.  టీమిండియా ఫ్యాన్స్ కూడా దీనిపై ఇదే విధంగా స్పందిస్తున్నారు..

చూస్తుంటే టీమిండియా జెర్సీని స్విగ్గీ తయారుచేసినట్టుగా ఉంది, అందుకే డెలివరీ బాయ్స్ డ్రెస్ కోడ్‌ని దించేశారని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. 

2015, 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో సెమీ ఫైనల్ నుంచి ఇంటిదారి పట్టిన టీమిండియా, ఈసారి భారీ అంచనాలతో బరిలో దిగుతోంది. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శుబ్‌మన్ గిల్, వన్డే వరల్డ్ కప్ 2023 ఆరంభానికి ముందు డెంగ్యూ బారిన పడ్డాడు.

ఆస్ట్రేలియాతో జరిగే మొదటి మ్యాచ్‌కి శుబ్‌మన్ గిల్ అందుబాటులో ఉండడం లేదని సమాచారం. శుబ్‌మన్ గిల్ ప్లేస్‌లో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయబోతున్నాడు..  తొలి రెండు మ్యాచులకు అందుబాటులో లేకపోయినా పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ సమయానికి శుబ్‌మన్ గిల్ పూర్తిగా కోలుకుంటాడని సమాచారం. అయితే బీసీసీఐ ఇప్పటిదాకా శుబ్‌మన్ గిల్ హెల్త్ గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios